ప్రపంచంలోనే ఇవి వింతైన పండ్లు..వీటి రుచి మాత్రం కొంచెం డిఫ్రెంట్‌ గురూ..!

-

ఫ్రూట్స్‌ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. పండ్లలో బోలెడ్‌ రకాలు ఉంటాయి. కొన్ని సీజనల్‌లో దొరికితే..మరికొన్ని అన్నివేళలా అందుబాటులో ఉన్నాయి. మనిషి శరీరంలో ఒక్కో అవయువానికి ఆరోగ్యాన్ని ఇచ్చే..ఫ్రూట్స్‌ ఉన్నాయి. అయితే మనం ఎప్పుడూ చేసేవి కాకుండా..కొంచెం భిన్నమైన ఫ్రూట్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా.. వైట్‌ స్ట్రాబెరి, రెడ్‌ నిమ్మకాయ, అన్నింటికికన్నా హైలెట్‌ బుద్దఆకారంలోని బేర్రి..వీటి గురించి ఇప్పుడు చూద్దాం.

స్క్వేర్ పుచ్చకాయ: పుచ్చకాయలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అయితే మీరెప్పుడైనా స్క్వేర్ మెలోన్ చూశారా? అవును, ప్రపంచంలో గుండ్రని మాత్రమే కాదు, చదరపు ఆకారంలో పుచ్చకాయలు కూడా ఉన్నాయి. అవి జపాన్‌లో మాత్రమే పెరుగుతాయి. ఈ పుచ్చకాయలు..ఆకారంలోనే కాదు..కాస్ట్‌ కూడా ఎక్కువే. ఈ పుచ్చకాయల ధర దాదాపు 60 వేల రూపాయలు ఉంటుంది. ఇది మామూలుగా మనం తినే పుచ్చకాయ రుచి కంటే భిన్నంగా ఉంటుంది.

వైట్ స్ట్రాబెర్రీ: సాధారణంగా మనం శీతాకాలంలో ఎర్రటి స్ట్రాబెర్రీలు దొరుకుతాయి..తెల్లటి స్ట్రాబెర్రీలు కూడా ఉంటాయి. అదే పైన్ బెర్రీ. ఎరుపు స్ట్రాబెర్రీలలో తెల్లని గింజల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆడ్రీ పైన్ ఎర్రటి విత్తనంతో తెల్లటి పండు. పైనాపిల్ రుచి కారణంగా ఈ పండును పైన్ బెర్రీ అని పిలుస్తారు.

బుద్ధ ఆకారపు బేర్రీ: ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతాలలో పండే పండ్లలో పియర్స్ ఒకటి. పియర్ పండును మర్సబ్ అని కూడా అంటారు. ఇది బుద్ధ ఆకారంలో ఉంటుంది. ఇది చాలా అరుదు, దాని ధర వేల రూపాయల్లో ఉంటుంది., దీన్ని చైనా కంపెనీ తయారు చేస్తుంది.

ఎరుపు నిమ్మకాయలు: నిమ్మకాయలు అంటే పసుపు, పచ్చ రంగులో ఉంటాయి. కానీ ఇది ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని పండు అని పిలిచినప్పటికీ, ఇతర పండ్ల మాదిరిగా నేరుగా తినలేరు. ఇది ఆన్‌లైన్‌ లో కూడా మనకు అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version