లగచర్లలో పెట్టిన అక్రమ కేసులను వెంటనే తోలిగించాలని గిరిజనుల ధర్నా..!

-

కొడంగల్లు నియోజివర్గ లగచర్లలో అమాయక గిరిజనుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రాయపర్తి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు గిరిజనులతో ర్యాలీ పాల్గొన్న ఎర్రబెల్లి.. గిరిజనులతో కలిసి తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అరెస్టు చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలి. గిరిజనుల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తోలిగించాలి. అల్లుడు,వియ్యంకుడు,తమ్ముని కోసం భూసేకరణ చేపట్టావా. మహిళలకు ఏం చేసినావ్ అని వరంగల్ లో సభ ఎందుకు పెడుతున్నావ్. రైతుబంధు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టావ్, మహిళలకు 2500 సాయం ఇవ్వలేదు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. కానీ విజయోత్సవ సభలు పెట్టడానికి సీఎం రేవంత్ కు సిగ్గులేదా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి.. గిరిజన మహిళలపై కేసులు ఎత్తివేయకుంటే ఎంత దూరం కైనా వెళ్తాం అని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version