కప్పలకు లిఫ్టిచ్చిన కొండచిలువ.. వైరల్ ఫోటో

-

Toads 'Hitching A Ride' On Python's Back photo goes viral

కొండచిలువ ఏంది.. కప్పలకు లిఫ్ట్ ఇవ్వడం ఏంది. వాటిని చూడగానే అది లటక్కున నోట్లో వేసుకుంటుంది కానీ లిఫ్ట్ ఇస్తుందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. అది నిజంగా లిఫ్ట్ ఇచ్చింది. కావాలంటే పైన ఫోటో చూడండి. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలోని కునునుర్రాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

కునునుర్రాకు చెందిన పాల్ మాక్ అనే వ్యక్తికి ఓ డ్యామ్ ఉంది. అయితే గత ఆదివారం రాత్రి కునునుర్రాలో గాలిదుమారం లేసి విపరీతంగా వర్షం కురిసిందట. దీంతో తన డ్యామ్ లో నీళ్ల పరిస్థితిని తెలుసుకుందామని అక్కడికి వెళ్లాడట పాల్. అక్కడికి వెళ్లాక.. అక్కడ ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయాడట. టోడ్స్ అని పిలవబడే కప్పలు(ఆస్ట్రేలియాలో కప్పలను టోడ్స్ అని పిలుస్తారు) కొండ చిలువ మీద ఎక్కి ఉన్నాయట. దాని మీద కూర్చొని అవి స్వారీ చేయడం పాల్ గమనించాడు. వరదల్లో ఆ కొండచిలువ ఫాస్ట్ గా వెళ్తుంటే.. అక్కడ ఉన్న కప్పలు.. దాని మీదికి ఎక్కి స్వారీ చేస్తున్నాయట. వెంటనే పాల్ ఫోటో తీసి తన సోదరుడికి పంపించాడట ఆ ఫోటోను. పాల్ సోదరుడు ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version