ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు మ‌హిళ వినూత్న ఆలోచ‌న‌.. కారుపై ఆవు పేడ పూసింది..!

-

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన సెజ‌ల్ షా అనే మ‌హిళ ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు ఓ ఆలోచ‌న చేసింది. ఆమె ఇంట్లోని గ‌చ్చును మొద‌ట ఆవు పేడ‌తో అలికింది. దీంతో ఇల్లు చ‌ల్ల‌గా అయింది.

ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మే నెల చివ‌రి రోజులు కావ‌డంతో ఎండ మ‌రీ ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప‌గ‌టిపూట అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కు న‌మోద‌వుతుండ‌డం విశేషం. కాగా ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల య‌త్నాలు చేస్తున్నారు. ఇండ్ల‌పై వైట్ పెయింట్ వేసుకుని ఇంట్లోకి వేడి రాకుండా కొంద‌రు చూస్తుంటే.. మ‌రికొంద‌రు ఇండ్ల‌పై గ్రీన్ క‌వ‌ర్ల‌ను క‌ప్పుతున్నారు. ఇక గుజ‌రాత్‌లో అహ్మ‌దాబాద్‌కు చెందిన ఆ మ‌హిళ మాత్రం ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు ఓ వినూత్న ఆలోచ‌న చేసింది. అదేమిటంటే…

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన సెజ‌ల్ షా అనే మ‌హిళ ఎండ వేడి నుంచి త‌ట్టుకునేందుకు ఓ ఆలోచ‌న చేసింది. ఆమె ఇంట్లోని గ‌చ్చును మొద‌ట ఆవు పేడ‌తో అలికింది. దీంతో ఇల్లు చ‌ల్ల‌గా అయింది. ఉష్ణోగ్ర‌త త‌గ్గింది. దీంతో ఆమె అదే ఆవు పేడ‌ను కారుపై పూత‌గా పూసింది. ఈ క్ర‌మంలో త‌న కారులో కూడా చ‌ల్ల‌గా ఉంద‌ని ఆమె చెబుతోంది. అయితే ఆమె అలా కారుపై ఆవు పేడ‌ను పూయ‌డం ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న కారుకు పేడ పూసిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవిప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

అలా సెజ‌ల్ షా చేసిన ప‌నిని ఇప్పుడూ అంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. నిజంగానే ఆవు పేడ ఎండ నుంచి ర‌క్షిస్తుందా, మ‌న‌ల్ని చ‌ల్ల‌గా ఉంచుతుందా.. అని అంద‌రూ స‌మాధానాలు వెద‌క‌డం ప్రారంభించారు. ఇక కొంద‌రైతే ఆ విధానాన్ని ఫాలో అవుతున్నాం.. అని సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఏది ఏమైనా.. ఆవు పేడ‌తో ఉప‌యోగాలు ఉంటాయ‌ని మ‌నం గ‌తంలో విన్నాం. కానీ ఈ ర‌కంగా ఆ పేడ ప‌నికొస్తుంద‌ని మ‌న‌కు నిజంగా తెలియ‌దు. మ‌రి మీరు కూడా ఒక‌సారి పై విధానాన్ని ట్రై చేసి చూడండి. చ‌ల్ల‌గా ఉంటే న‌లుగురికీ చెప్పండి. ఈ విషయాన్ని అంద‌రికీ తెలియ‌జేయండి. ఈ పోస్టును షేర్ చేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version