ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అన్నీ బొద్దింకలే.. వీడియో

-

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? కాస్త జాగ్రత్త. ముందు ఈ వార్త చదవండి.. మీరు అవాక్కవడం ఖాయం…

ఇప్పుడు ఇంట్లో వండుకొని తినాలి… అనేది ఏమీ లేదు. క్షణాల్లో ఫుడ్ బుక్ చేస్తే అర్ధగంటలో కావాల్సిన ఆహారం గుమ్మం తడుతుంది. ఏ ఆహారం అంటే అది ఇంటికి చేరుతుంది. వండుకోవాల్సిన అవసరమే లేకుండా… స్మార్ట్ ఫోన్ లో కూడా ఎన్నో యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే… ఆన్ లైన్ ఫుడ్ అంటే దాని పరిశుభ్రత, దాని నాణ్యత గురించి మాట్లాడుకోవాల్సిందే.

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ ద్వారా వచ్చే ఫుడ్ క్వాలిటీ, హైజీనిటీ గురించి మాత్రం మనం ఆలోచించద్దు. అలా ఆలోచిస్తే అసలు ఆన్ లైన్ ఫుడ్ నే తినలేం.. అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.

చైనాకు చెందిన ఓ మహిళ తన ఫ్రెండ్స్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసింది. అసలే ఆకలి మీద ఉన్న తన స్నేహితులు వెంటనే పార్శిల్ విప్పి తినడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే దాంట్లో చనిపోయిన బొద్దింకలు వాళ్లకు కనిపించాయి. అంతే.. బొద్దింకలను చూడగానే వాళ్లకు వాంతులు వచ్చినంత పనయింది. వెంటనే దాంట్లో ఉన్న బొద్దింకలన్నింటినీ బయటికి తీసి లెక్కించగా అవి 40 దాకా ఉన్నాయి. బొద్దింకలను ఫుడ్ లో నుంచి బయటికి తీస్తున్నప్పుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తర్వాత ఆ ఫుడ్ రెస్టారెంట్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రెస్టారెంట్ ను మూసేశారు. ఇక.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంలో నెటిజన్లు ఆ బొద్దింకలను చూసి.. యాక్.. అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version