ఆహా… పాము ఇలా కూడా ఉంటుందా…?

-

సాధారణంగా పాములు ఏ రంగులో ఉంటాయి…? మనం చూసిన దాని ప్రకారం… ఒక్కో పాము ఒక్కో రంగులో ఉంటుంది. లేదు అంటే పసుపు తెలుపు రంగులో కలిపి ఉంటాయి కొన్ని. ఏ రంగు ఉన్నా తెలుపు రంగు కామన్ గా ఉంటుంది చాలా పాములకు. మనం ఇప్పటి వరకు చూసిన ప్రతీ పాము కూడా అదే విధంగా ఉండే ఉంటుంది. కాని ఒక పాము మాత్రం వింతగా ఉంది. రకరకాల రంగులలో ఉంది ఆ పాము.

దాదాపు 50 ఏళ్ళ తర్వాత రెయిన్ బో అనే స్నేక్ ని గుర్తించారు కొందరు. ఈ పాము ఫ్లోరిడాలో కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ పాము శరీరంపై ఇంద్రదనస్సులా విభిన్న రంగాలు ఉంటాయి. ‘ఒకాలా నేషనల్ ఫారెస్ట్’ అటవీ ప్రాంతంలో ట్రేసీ కాథెన్ అనే వ్యక్తి పర్యటించగా ఆ ప్రాంతంలో నాలుగు అడుగుల పొడవు ఉన్న రంగురంగుల పాము అతనికి దర్శనం ఇవ్వడంతో ఆ పామును ఫోటో తీశాడు.

ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అధికారులకు సమాచారం ఇవ్వగా… అరుదైన జాతికి చెందిన రెయిన్‌బో స్నేక్‌గా అధికారులు నిర్థారించారు. ప్లోరిడాలో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాతికి చెందిన పాము కనిపించి౦దని చెప్పారు. ఈ పాము చివరగా 1969లో ఫ్లోరిడాలో కనిపించింది. రెయిన్‌బో స్నేక్ విషసర్పం కాదని జలచర జీవులైన ఇవి ఎక్కువగా నీటిలోనే సంచరిస్తుంటాయని, వాటి వలన ఏ ప్రమాదం ఉండదని వాళ్ళు చెప్పారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news