కొత్త సంవత్సరం వేడుకలు సరిగ్గా లేవని వేదికకు నిప్పు పెట్టాడు..

-

Youth set fire to stage in madhapur hyderabad

కొత్త సంవత్సరం వేడుకల్లో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కొత్త సంవత్సరం వేడుకలు సరిగి లేవని ఆ యువకుడు ఏకంగా వేడుకలు జరుగుతున్న వేదికకే నిప్పంటించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న సిద్ధివినాయక నగర్  క్రికెట్ గ్రౌండ్ లో చోటు చేసుకున్నది.

సోమవారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయిన కొద్ది సేపటికే తమకు సరిగ్గా మద్యం అందడం లేదని, డీజే కూడా సరిగ్గా లేదని కొంతమంది యువకులు నిర్వాహకులతో గొడవకు దిగారు. టేబుళ్లను విసిరేశారు. కుర్చీలను చిందరవందర చేశారు. అనంతరం మద్యం సీసాలను వేదిక మీదికి విసిరేశారు. తర్వాత నిప్పంటించారు. దీంతో ఆప్రాంతంమంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో న్యూఇయర్ వేడుకలకు వచ్చినవారు ఏం జరుగుతున్నదో తెలియక సతమతమయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పించి.. ఈ ప్రమాదానికి కారణమైన యువకులను అక్కడి నుంచి బయటికి పంపించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగి తిరిగి అందరూ నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version