తెలుగు అమ్మాయితో హీరో విశాల్ పెళ్లి..!

-

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ సిని వర్గాలు. కొన్నాళ్లుగా తమిళ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం కొనసాగించిన విశాల్ దాన్ని సక్సెస్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక త్వరలోనే ఓ తెలుగు అమ్మాయిని పెళ్లాడుతున్నాడని విశాల్ తండ్రి జికె రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సెలబ్రిటీస్ ప్రేమ కొన్నిసార్లు సక్సెస్ అయితే మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతుంటాయి. బాలీవుడ్ లో దీపికా, రన్ వీర్ ల ప్రేమ సక్సెస్ అయ్యింది. వారు వారి ప్రేమని గెలిపించుకుని పెళ్లితో ఒకటయ్యారు. ఇక ప్రియాంకా చోప్రా కూడా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమ పెళ్లి తెలిసిందే. ఇలా వారు ప్రేమని గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు.

విశాల్, వరలక్ష్మిల మధ్య నడిచిన లవ్ స్టోరీ అందరికి తెలిసిందే కాని ఎందుకో విశాల్ ఇక తన వల్ల కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విశాల్ పెళ్లి చేసుకునేది తెలుగు అమ్మాయినే అని తెలుస్తుంది. నెల్లూరి మూలాలు కలిగిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అవగా ఆ ఇంటి అమ్మాయిని పెళ్లాడుతున్నాడట.

విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి అనీషా అని తెలుస్తుంది. త్వరలో ఈ పెళ్లికి సంబందించిన డీటైల్స్ బయటకు వస్తాయి. ప్రసుత్తం కోలీవుడ్ లో విశాల్ మంచి ఫాం లో ఉన్నాడు. టెంపర్ రీమేక్ గా వస్తున్న అయోగ్య సినిమాలో విశాల్ నటిస్తున్నాడు. ఆ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version