వేసవిలో చల్లదనాన్నిచ్చే నిమ్మరసం.. బెల్లంతో కలిపి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

-

మే నెల చివరికి వస్తున్న కొలది ఎండలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఎండాకాలం పూర్తవడానికి ఇంకా కొన్ని రోజులే ఉందనో ఏమో, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ మండు వేసవిలో శరీర వేడిని తగ్గించుకోవాలని రకరకాల ఆహారాలు తింటుంటారు. అన్ని ఆహారాల్లోకి అతి ముఖ్యమైన చౌకైనది ఏదైనా ఉందంటే అది నిమ్మరసం అనే చెప్పాలి.

చల్లటి నిమ్మరసం గొంతులోకి దిగితే శరీరంలో వేడి అలా మాయమైపోతుంది. నిమ్మరసంతో పానీయాన్ని రకరకాలుగా తయారు చేసుకొవచ్చు. ఎప్పుడూ చేసే మాదిరి కాకుండా ఈ సారి కొంచెం కొత్తగా ప్రయత్నించండి. బెల్లంతో కలిపి నిమ్మరసాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. దీని కోసం కింద రెసిపీని కూడా ఇచ్చాం. ప్రయత్నించండి.

ఈ లాక్డౌన్ సమయాన ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, ఈ వెరైటీని ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

దీనికోసం కావాల్సిన పదార్థాలు

నిమ్మకాయ- 1
తాజా అల్లం- 1అంగుళం
పుదీనా ఆకులు- కొన్ని
బెల్లం – 1టేబుల్ స్పూన్
మంచినీళ్ళు- 3/4గ్లాసు
నల్ల ఉప్పు- 1/2టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/4టేబుల్ స్పూన్
ఉప్పు- కొద్దిగా
ఐస్ క్యూబ్స్- 2- 3

అన్ని పదార్థాలని మిక్స్ చేసి దాన్లోని చక్కెర పూర్తిగా కరిగిపోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి. బాగా కరిగిందనుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచుకుని వడపోసి మరో పాత్రలోకి తీసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన వారికి గ్లాసుల్లో పోసి పంచుకోండి. బెల్లం కలిపిన నిమ్మరసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version