కనుమ నాడు రధం ముగ్గు ఎందుకు వేయాలి? కారణం ఏంటంటే?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలో సంక్రాంతి కూడా ఒకటి. ప్రతి పండుగకు కొన్ని ఆచారాలు, నియమాలు ఉండగా వాటి వెనుక శారీరక, మానసిక, ఆధ్యాత్మికం అనే ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ధనుర్మాసం మొదలు దాదాపు నెల రోజుల పాటు సంక్రాంతి సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి ముగ్గులు, పిండి వంటలు, దేవాలయాలు వంటివి గుర్తుకొస్తాయి. అయితే ఈ సాంప్రదాయాలు వెనక శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది.

సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ నాడు వ్యవసాయదారులు అందరూ వారి పశువులను అలంకరించి, పూజ చేస్తారు. సంక్రాంతి సమయంలో ధాన్యం వచ్చింది అంటే దానికి కారణం పశువులే అందువలన వాటికి కృతజ్ఞత చెబుతూ కనుమ నాడు పశువులను పూజిస్తారు. అయితే ఇంటి ముందు వేసే ముగ్గులు మహాలక్ష్మిని ఆహ్వానం పలికేందుకు. ధనుర్మాసం నెల రోజులపాటు ఎన్నో రకాల ముగ్గులతో ఇంటి ముందు అందరూ వేస్తారు. ఈ ముగ్గులు నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు.

దానితో పాటుగా ప్రకృతిలోని జీవులు పట్ల భూత దయతో ఉండమని సంకేతిస్తాయి. ఇంటి ముందు వేసే ముగ్గులు బియ్యం పిండితో వేయడం జరుగుతుంది. ఆ పిండిని తినడానికి చీమలు, బొద్దింకలు వస్తాయి. దీంతో జీవులకు ఆహారం కూడా అందించుతున్నట్టే. కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా ముగ్గులు పెట్టడం వలన మనసుకు, శరీరానికి ఓర్పు నేర్పు ఏకాగ్రతను అందిస్తాయి. కనుమ రోజు మాత్రం రథం ముగ్గు వేసి ఆ రధాన్ని వీధి చివరి వరకు లాగుతారు. ఇలా రథం ముగ్గును సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మికం కు చిహ్నంగా భావించి వేయడం జరుగుతుంది. రథం ను నడిపేవాడు పరమాత్ముడని, సరైన దారిలో నడిపించమని కోరుతూ ప్రార్థించటమే ఈ రథం ముగ్గులు వెనుక విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version