క్రిస్మస్ ట్రీ ని ఎందుకు పెడతారు..? దానికి వెనుక వున్న కధ ఇదే..!

-

క్రిస్మస్ పండుగ అంటే మనకు గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. చాలా మంది ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీ ని పెడతారు. అలాగే క్రిస్మస్ స్టార్ ని కూడా పెడతారు. ప్రతి ఏటా డిసెంబర్ 25న క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవులు అందరూ ఎంతో ఘనంగా క్రిస్మస్ పండుగ ఎలా జరుపుతారు.

అందంగా క్రిస్మస్ చెట్టు ని డెకరేట్ చేస్తారు. వాటికి విద్యుద్దీపాలను కూడా పెడతారు. అయితే ఎందుకు క్రిస్మస్ ట్రీని తరతరాలుగా పెడుతూ వస్తున్నారు..? ప్రతి ఏడాది ఎందుకు పెట్టాలి అన్న సందేహం చాలా మందిలో కలిగే ఉంటుంది. అయితే దాని వెనుక ఉండే రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

క్రిస్మస్ పండుగ కి క్రైస్తవులు తమ ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీని పెడతారు. దానిని ఎంతో అందంగా అలంకరిస్తారు. అసలు క్రిస్మస్ ట్రీ వెనుక ఉండే కథ ఏమిటంటే…. ఒకప్పుడు ఒక ఊరిలో ప్లాబో పేద పిల్లవాడికి గిఫ్ట్ కింద తీసుకువెళ్లడానికి ఏమీ లేదు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక అందమైన మొక్కని తీసుకుని పూల కుండీలో పెట్టి దానిని చర్చికి తీసుకెళ్లాడు.

దానిని తీసుకువెళ్లగా అక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా అది చూసి నవ్వుతారు. ఆ సమయంలో ఆ చెట్టు బంగారం చెట్టు కింద మారిపోతుంది దీంతో అక్కడ వాళ్లంతా కూడా సిగ్గు పడతారు. అప్పటి నుండి కూడా ఇది ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ రోజు ఇంట్లో అందంగా క్రిస్మస్ ట్రీ ని అలంకరించడం జరుగుతుంది. అప్పుడు మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కూడా అందరూ అనుసరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news