SHOCKING NEWS: ఓమిక్రాన్ వేరియంట్ పై వ్యాక్సిన్లు పనిచేయడం లేదు.

-

ప్రపంచాన్ని ఓమిక్రాన్ వేరియంట్ అల్లాడిస్తోంది. తక్కవ కాలంలోనే ప్రపంచంలోని సగం దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో మరణ ఘంటికలు మోగిస్తోంది. దీని ధాటికి యూకేలో కేసుల సంఖ్య 70 వేలకు పైగా చేరింది. ఇక డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్ దేశాలతో పాటు యూఎస్ఏలో కూడా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కూడా మళ్లీ ఓమిక్రాన్ వస్తుండటం కలవరపెడుతోంది.

తాజాగా యూఎస్ఏ కొలంబియా యూనివర్సిటీ చేసిన సర్వేలో షాకింగ్ విషయం బయటపడింది. కోవిడ్ వ్యాక్సిన్లు, యాంటీబాడీ థెరపీ ద్వారా లభించే రక్షణ నుంచి ఓమిక్రాన్ తప్పించుకోగలదని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇప్పుడు మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ఓమిక్రాన్ వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేయడం లేదని సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఓమిక్రాన్  నేపథ్యంలో కొత్త వ్యాక్సిన్లను తయారు చేయాలని సర్వే అభిప్రాయపడింది. ఇన్నాళ్లు వ్యాక్సిన్లకు డెల్టా వేరియంట్ లొంగింది. అయితే ఓమిక్రాన్ వైరస్ లో మ్యుటేషన్లు అధికంగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఈజీగా తప్పించుకుంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news