చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పక్కన పెట్టాల్సిన ఆహార పానీయాలు..

-

చలికాలంలో వేడి వేడి పదార్థాలని తినడానికి ఇష్టపడుతుంటారు. శరీరానికి వేడి చేసే పదార్థాలు తినాలని చూస్తుంటారు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేడి కలిగించే పదార్థాలు తింటుంటారు. ఐతే చలికాలంలో జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే కొన్ని ఆహారాలని తినకుండా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఎలాంటి ఆహారాలని తినకూడదో ఇక్కడ చూద్దాం.

చల్లని పదార్థాలు

ఫ్రిజ్ లో నుండీ తీసిన పదార్థాలని తినేముందు ఒక్కసారి ఆలోచించండి. కూల్ డ్రింక్స్ వంటివి శరీర జీవక్రియని తగ్గిస్తాయి. అలాగే రోగాలతో పోరాడే శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి జబ్బులు చాలా తొందరగా వచ్చేస్తాయి. చల్లనివి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాన్ని మళ్ళీ సరైన స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే చల్లని పదార్థాలని పక్కన పెట్టడమే మంచిది.

పాల పదార్థాలు

పాల పదార్థాల వల్ల శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. అందుకే పాల పదార్థాలని పెద్దగా పట్టించుకోకపోవడమే బెటర్. మిల్స్ షేక్స్ వంటి ఫ్రీజర్ లో నుండి తీసిన వాటిని తాగవద్దు. పెరుగు కూడా అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత పాల పదార్థాలని ఆహారంగా తీసుకోవద్దు.

మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్

మాంసం కూడా చలికాలం తీసుకోకుంటే బెటర్. మాంసం అరగడానికి చాలా టైమ్ పడుతుంది. అంతే కాదు చలికాలం పూట కొంత మందిలో అలెర్జీలు రావడానికి మాంసం కారణమవుతుంది.

ఇంకా సలాడ్లు, రా ఫుడ్, కేలరీలు లేని కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలని ఎంత కంట్రోల్ లో ఉంచితే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version