గుండెను పదిలంగా ఉంచడంతోపాటు మెదడును చురుగ్గా చేసే వాల్ నట్స్ ప్రయోజనాలు

-

రోజువారి ఆహారంలో గింజలను భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే గింజల్లో ముఖ్యంగా వాల్ నట్స్ ఉండాల్సిందే. కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు, ఇతర పోషకాలు పుష్కలంగా కలిగిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం అది ఏంటో తెలుసుకుందాం.

బరువును నియంత్రణలో ఉంచుతుంది:

వాల్ నట్స్ తీసుకోవడం వల్ల మాటిమాటికి ఆకలి వేయకుండా ఉంటుంది. దానివల్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ తినకుండా ఉంటారు. ఈ విధంగా మీ శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది.

జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది:

వాల్ నట్స్ లో ఫైబర్ ఉండడం వల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కడుపులో పేగుల కదలికలు చురుగ్గా ఉంటాయి.

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:

తక్కువ గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్న వాల్నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు వాల్నట్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది:

మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి మూలకాలు పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు తమ దృఢత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. రోజువారి ఆహారంలో వాల్నట్స్ భాగం చేసుకోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గకుండా ఉంటుంది.

సుఖనిద్రను అందిస్తుంది:

పడుకునే ముందు వాల్నట్స్ తినడం వల్ల సుఖంగా నిద్ర పడుతుంది. నిద్రకు ఉపయోగపడే హార్మోన్ అయిన మెలటోనిన్ ని విడుదలయ్యేలా చేస్తుంది.

గుండెను పదిలంగా ఉంచుతుంది:

వాల్ నట్స్ లో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు.. గుండెకు కనెక్ట్ అయ్యే రక్తనాళాల్లో చెడు కొవ్వును తగ్గించి రక్తం సులభంగా ప్రవహించేలా చేస్తాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

అంతేకాదు మెదడును చురుగ్గా చేసి వయసు పెరుగుతుంటే వచ్చే మతిమరుపు సమస్యలు రాకుండా చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version