నోరూరించే ‘ దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీ ‘ 

కావాల్సిన ప‌దార్ధాలు:
దొండకాయలు – 1/2 కేజి,
టమోటాలు – 2,
కరివేపాకు – 4 రెబ్బలు,
కొత్తిమీర తరుగు – అరకప్పు,


నూనె – 1 టేబుల్‌ స్పూను,
వేరుశనగపప్పు పొడి – అరకప్పు,
బ్రౌన్‌ షుగర్‌ – 1 టేబుల్‌ స్పూను,
కారం – 1 టీ స్పూను,
ధనియాలు – 1 టేబుల్‌ స్పూను,
ఆమ్‌చూర్‌పొడి – 1 టీ స్పూను,

నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు,
మెంతులు – 1 టీ స్పూను,
జీలకర్ర – 1 టీ స్పూను,
గసగసాలు – 1 టేబుల్‌ స్పూను,
ల‌వంగాలు – 2.
బిర్యాని ఆకు – 1.

త‌యారి విధానం: ముందుగా గసగసాలు, నువ్వులు కలిపి వేగించి పొడిచేయాలి. దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. మిగతా మసాల దినుసులను కూడా సన్నమంట మీద వేగించి పొడిచేయాలి. దొండముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి. కడాయిలో ఒక‌ టేబుల్‌స్పూన్‌ నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి.

ఆ త‌ర్వాత‌ నువ్వులు, బ్రౌన్‌షుగర్‌, గసగసాలపొడి, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. 5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉడికించాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీ రెడీ..

దొండ‌కాయ‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు మ‌రియు ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. కొంద‌రు దొండ‌కాయలు తింటే మ‌తి మ‌ర‌పు వ‌స్తుంద‌ని అనుకుంటారు. కానీ, అది కేవ‌లం ఆపోహ మాత్రమే. దొండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇలా మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాలుగా మేలు చేసే దొండ‌కాయ తిన‌డం మంచిదే..