నాన్‌వెజ్ తినే వారిలో చికెన్ తినని వారుండరు.. మంచి మాంసకృతులు కలిగిన ఆహారం. సాయంకాలవేలలో స్నాక్స్ తినాలి అనుకునే వాళ్లకోసం చికెన్ పకోడి మంచి ఛాయిస్.. చికెన్‌తో తయారు చేసే వంటకాల్లో ఇదిప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. దీన్ని తయారు చేసే విధానం మీ కోసం…
కావల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ
పుదీన, కొత్తిమీర – కట్ట చొప్పున
పచ్చి మిర్చి – 4
అల్లం – చిన్నముక్క
వెల్లుల్లి – 6 రెబ్బలు
నిమ్మకాయ – 1
ధనియాల పొడి – చెంచా
పెరుగు – 2 చెంచాలు
శనగపిండి – అర కప్పు
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపోయినంత
చికెన్ పకోడి తయారీ విధానం
పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీన ముద్ద వేసి బాగా కలియ తిప్పాలి. గంటసేపు అయిన తరువాత చెంచా వేడి నూనె, శనగపిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలు, ఉల్లి చక్రాలతో అలంకరించుకుంటే చాలు. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు. దీంతో పకోడీలు క్రంచీ, క్రిస్పీగా కర కరలాడతాయి.