కృత్రిమ రంగుల్లేకుండా రంగు రంగుల చపాతీ.. తయారు చేసుకోండిలా..

-

ఎప్పుడూ ఒకే ఆహారాన్ని తినడం ఎవ్వరికైనా బోరింగ్ గానే ఉంటుంది. అందుకే ఆదివారం వచ్చినపుడల్లా బయటకి వెళ్ళి ఏ హోటల్ లోనో, రెస్టారెంట్ లోనో నచ్చిన ఆహారాన్ని తినడానికి వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా టైమ్. బయటకి వెళ్లే అవకాశం లేదు. ఆన్ లైన్ డెలివరీ చేసుకునే అవకాశం ఉన్నా బయట ఆహారం అవసరమా అన్న ఆలోచనతో అది కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఏదైనా కొత్త ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఉంటుంది.

అలాంటి వాళ్ళు ఈ రంగు రంగుల చపాతీల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవును, సాధారణంగా తెల్లగా ఉండే చపాతీ ఎరుపు రంగులో, ఆకుపచ్చ రంగులో లభిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అది కూడా కృత్రిమ రంగులేమీ ఉపయోగించకుండా రంగు రంగుల చపాతీలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఐతే ఇది చూడండి.

ఈ రంగు రంగుల చపాతీలని తయారు చేయడానికి బీట్ రూట్, పాలకూర కావాల్సి ఉంటుంది. అదెలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

1కప్పు పిండి
1/2కప్పు ఉడకబెట్టిన బీట్ రూట్
లేదా
1/2 ఉడకబెట్టిన పాలకూర

తయారీ పద్దతి

ఇప్పుడు ఉడకబెట్టిన బీట్ రూట్ తీసుకుని, దానికి కొద్దిగా పిండి కలుపుకుని మెత్తగా అయ్యేంత వరకు పిసకాలి. ఇప్పుడు ఆ పిండి మీరనుకున్న రంగులోకి మారుతుంది. అంటే, బీట్ రూట్ తో చేసినవి ఎరుపు రంగులోకి, పాలకూరతో చేసినవి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

ఇలా తయారు చేసిన చపాతీలని మీకు నచ్చిన వారికి స్పెషల్ గా వడ్డించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version