ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే పెరుగుని అస్సలు తీసుకోకూడదు..!

-

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగును తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎన్నో రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా కూడా మెండుగా ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే కాదు పెరుగుని తీసుకోవడం వలన గట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెరుగులో క్యాల్షియంతో పాటుగా పొటాషియం కూడా ఉంటుంది. పెరుగును తీసుకోవడం వలన ఎముకలు, దంతాలు బలంగా దృఢంగా మారుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. పులియబెట్టిన పెరుగుని తయారు చేసే ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

ప్రోటీన్స్, క్యాల్షియం తో పాటుగా విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెల్ది గట్ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి, ఆహారంలో పోషకాల గ్రహించడానికి సహాయపడుతుంది జీర్ణాశయాంతర సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పెరుగు సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. ఒత్తడి, ఆందోళనని కూడా పెరుగు తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక పెరుగుని ఎవరు తీసుకోకూడదు అనే విషయానికి వచ్చేస్తే.. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు పెరుగుని తీసుకోకూడదు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటే పెరుగును తీసుకోవద్దు. ఎముకలని ఆరోగ్యంగా ఉంచే క్యాల్షియం ఇందులో ఉన్నప్పటికీ పెరుగును తింటే కీళ్లనొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఉబ్బసం ఉన్నవాళ్లు పెరుగును తీసుకోకపోవడమే మంచిది. మలబద్దకంతో బాధపడే వాళ్ళు కూడా పెరుగును తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version