తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ : కేటీఆర్ స్పెషల్ ట్వీట్

-

తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ ఆడపడుచులకు ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.నేటి నుంచి నిర్విరామంగా తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులంతా ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ..తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మే అని పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ పండుగ అని కొనియాడారు.సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు.ఆటపాటలతో,ఆనందోత్సాహాల నడుమ తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version