మాంసం ఎక్కువగా తినేవారు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు..

-

ఆహారం మితంగా తినాలని చెబుతుతుంటారు. మితంగా తింటే ఆహారం, అతిగా తింటే విషం అన్న సామెత అందరికీ తెలుసు. ఏదైనా ఎక్కువ తింటే చేటే కలుగుతుంది. ముఖ్యంగా మాంసాహారం. కూరగాయలు తినేవారిలో ఉండే ఆరోగ్య లక్షణాలు మాంసం తినేవారిలో ఉండవట. ఈ మేరకు పరిశోధన్లు జరిపిన పోషకాహార నిపుణులు, మాంసం ఎక్కువగా తినడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. మాంసాహారాన్ని ఇష్టపడేవారు మరీ ఎక్కువగా తినడం వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్లు కనుక్కున్నారు.

మనం తినే మాంసంలో విటమిన్ ఏ, విటమిన్ డి, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును విపరీతంగా పెంచుతాయి. దానివల్ల అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. గుండె జబ్బులు, మధుమేహం మొదలగు వ్యాధులన్నీ బరువు పెరగడం వల్ల వచ్చే సమస్యలు కూడా. వీటికి గల చాలా కారణాల్లో బరువు పెరగడం కూడా ఒకటి. అందుకే బరువుని అదుపులో ఉంచుకోవాల్సిందే. అలా ఉంచుకోవాలంటే మాంసాహారం తగ్గించాలి. వారానికి మూడు సార్ల కంటే ఎక్కువ మాంసం తింటున్నారంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే.

ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయని వెల్లడైంది. మాంసాహారం తినని వారిలో గుండెజబ్బులు వచ్చే శాతం 30గా ఉంటే మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఇది 15శాతం ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మాంసాహారం రోజూ తినాలనుకునే వారు ఎంత పెద్ద ప్రమాదంలో ఉంటారో తెలుసుకోండి. మాంసం తొందరగా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువే. సో.. మీ ఆహారంలో మాంసం ఉండనివ్వండి. కానీ అతిగా కాదు. మితంగానే.

Read more RELATED
Recommended to you

Exit mobile version