పాలలో విటమిన్లు ఏ, డి, ఈ, కె ఇంకా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలు శరీరానికి ఆరోగ్యకరమని చెబుతారు. అయితే వీగన్స్.. పాలను అస్సలు ముట్టుకోరు. మాంసంతో పాటు పాల పదార్థాలు ఇంకా జంతువుల నుండి వచ్చే ఆహారాలను వీగన్స్ ముట్టరు. అయితే పాలకు ప్రత్యామ్నాయంగా సోయా మిల్క్ వచ్చేసింది.
ఇది జంతువుల నుంచి వచ్చిన ఉత్పత్తి కాదు కాబట్టి దీన్ని నిస్సం కోచంగా తాగవచ్చు. సోయా మిల్క్ లోనూ అనేక పోషకాలు ఉన్నాయి.
సోయా మిల్క్ ఎలా తయారవుతుంది:
సోయా గింజల నుండి సోయా మిల్క్ తయారవుతుంది. అంటే ఇది మొక్కల నుండి వచ్చిన ఆహారం అన్నమాట. అందుకే దీని వైపు వీగన్స్ మొగ్గు చూపుతున్నారు.
సోయా మిల్క్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
సోయా మిల్క్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
సోయా మిల్క్ లో ప్రోటీన్ తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తాగిన తర్వాత ఆకలి తొందరగా వేయదు. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు తమ రోజువారి డైట్ లో సోయా మిల్క్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
చర్మ సంరక్షణలో సహాయం:
చర్మం మీద మచ్చలు ఏర్పడటం, చర్మం రంగు కోల్పోయి పాలిపోయినట్లుగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే సోయా మిల్క్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
గుండెకు మేలు చేసే సోయా మిల్క్:
ఇందులో మోనోసాచురేటెడ్ ఇంకా పాలి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉండడం వల్ల.. గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.