కాలిఫ్లవర్ తో ఇలా ఫ్రే చేయండి.. ఈవినింగ్ సూపర్ స్నాక్ ఐటమ్..!

-

మిరియాలతో ఏం చేసిన మస్త్ స్పైసీగా ఉంటాయి. వాటితో గోబీ ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ డబుల్. రుచికి రుచి.. హెల్తీ కూడా. ఆయిల్ లేకుండా.. మటర్ గోబీ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

మటర్ గోబీ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి కావాలిసిన పదార్థాలు..

కాలిఫ్లవర్ ముక్కలు ఒకటిన్నర కప్పు
పచ్చిబఠానీలు ఒక కప్పు
పుట్నాల పప్పు రెండు టేబుల్ స్పూన్స్
అల్లం స్లైసెస్ ఒక టేబుల్ స్పూన్
మిరయాల పొడి ఒక టేబుల్ స్పూన్
ధనియాలు ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
ఇంగువ పొడి కొద్దిగా

తయారు చేసే విధానం..

పొయ్యిమీద చిల్లుల ప్లేట్ లో వేసి కాలిఫ్లవర్ ను, పచ్చిబఠానీలు వేసి ఆవిరి మీద ఉడికించండి. మరీ మెత్తగా అక్కర్లేదు. పొయ్యిమీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర దోరగా వేయించి, పుట్నాలు పప్పు వేసి వేయించిన తర్వాత చల్లారనిచ్చి.. మిక్సీజార్ లో వేసి పొడి చేసుకోండి. పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి జీలకర్ర, ఇంగువ పొడి, అల్లం స్లైస్ స్, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా ఉడికించిన కాలిఫ్లవర్ , పచ్చిబఠానీలు వేసి కొద్దిసేపటికి ముందు చేసుకున్న పొడి కూడా వేసి మిరియాల పొడి చల్లండి. పైన నిమ్మరసం, కొత్తమీర చల్లేస్తే సరి..టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ.. కాలిఫ్లవర్ ను తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. ఇలా చేసి పెడితే.. ఇష్టంగా తినేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version