మోచేతుల చర్మం నల్లగా మారిందా.. ఈ టిప్స్ తో రంగు మార్చేయండి.!

-

మోచేయి, మోకాలు, చంకల్లో చర్మం సహజంగా అందరికి నల్లగానే ఉంటుంది. మొఖం మీద పెట్టినంత శ్రద్ధ మనం ఈ భాగాల్లో పెద్దగా పెట్టాం. ఇక అవి ఇంకాస్త నల్లగా తయారవుతాయి. ఇలా చర్మం నల్లగా మారడానికి హైపర్ పిగ్మెంటేషన్ గాఢత ఎక్కువగా ఉండే డియోడ్రెంట్స్ వాడడం, శుభ్రత పాటించకపోవడం వంటి ముఖ్య కారణాలు కావచ్చు. మెలనీన్ శాతం తగ్గినప్పుడు కూడా చర్మం నల్లగా మారుతుంది. ఇలాంటి చర్మ సమస్యలు చాలా మంది మహిళల్లో సర్వసాధారణం. అప్పుడు మొదలుపెడాతారు..కానీ ఆశించినంత ఫలితం మాత్రం రాదు. కొన్ని చిట్కాల ద్వారా ఈ భాగాల్లో కూడా చర్మాన్ని తెల్లగా మార్చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దాం.

కలబంద: కలబందలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కలబంద గుజ్జును చర్మం నల్లగా మారిన ప్రదేశంలో అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చర్మాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే క్రమేపీ నలుపుదనం తగ్గుతూ వస్తుంది.

కొబ్బరి నూనె: చర్మం నలుపుదనాన్ని తగ్గించడానికి ప్యూర్ కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. సహాయపడుతుంది. చర్మం నల్లగా మారిన బహుమూలల్లో కొబ్బరి నూనెను రాసుకుని పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి.

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసాన్ని నల్లగా మారిన ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం నలుపుదనం తగ్గుతుంది.

యాపిల్ సిడర్ వెనిగర్: ఒక కప్పులో యాపిల్ సిడర్ వెనిగర్, రెండు స్పూన్‌ల వంట సోడావేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన చర్మ భాగాలకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.

వంట సోడా: ఒక కప్పులో రెండు స్పూన్ ల వంట సోడా , కొన్ని నీళ్లు వేసి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళు, మోచేతులు, చంకల భాగాలలో రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు, నిమ్మరసం, పసుపు, శెనగపిండి: ఒక కప్పులో పెరుగు, నిమ్మరసం , పసుపు , శెనగపిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, చంక భాగంలో అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మంచి ఫలితాన్ని అందిస్తుంది.

నిమ్మ: నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా చర్మానికి సహాయపడుతుంది. ఈ చిట్కా అందరికి తెలిసే ఉంటుంది. కనుక చర్మం నల్లగా మారిన ప్రదేశంలో నిమ్మరసాన్ని రాసుకొని పది నిమిషాల తర్వాత నీటితో క్లీన్‌ చేసుకోవాలి. నిమ్మలోని విటమిన్-సి చర్మకణాలలోని మృతకణాలను తొలగించి చర్మం నలుపుదనాన్ని తగ్గిస్తుంది.

ఇవి అన్ని ఒకేసారి చేయడంతోనే ఫలితాలు వచ్చేయవు. కనీసం ఒక నెలపాటు..వారనికి ఒకటిరెండు సార్లు పైన చెప్పినవి ఏదో ఒకటి.. చేస్తుంటే..అప్పుడు తేడా మీరు గమనిస్తారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version