అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రిజ్‌లో పెట్టకుండానే ఎక్కువరోజులు ఇలా నిల్వ ఉంచుకోవచ్చు

-

మసాల వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడంతోనే మాంచి స్మెల్ వచ్చేస్తుంది..చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని గ్రైండ్ చేసుకుని..ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన పేస్ట్ కొన్నాళ్లకు అంత ఘాటు ఉండదు.ఇంకొటి..ఇళ్లలో అయితే ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది..కానీ రూమ్స్ లో ఉండేవాళ్లకు అన్ని సౌకర్యాలు ఉండవు..ఏదో వంటచేసుకోవడానికి నాలుగు గిన్నెలు..వండుకున్నప్పుడు అదే కిచెన్..తినేప్పుడు అదే హాల్..పడుకున్నేప్పుడు అదే బెడ్ రూమ్..ఇలా చాలామంది ఊర్లనుంచి నగరాలకు వచ్చి ఏదో జాబ్ చేసుకుంటూ.. అద్దెగదుల్లో ఆనందంగా ఉంటున్నారు.. మరి ఆదివారం వచ్చిందంటే.. చికెన్, మటన్ తేవాల్సిందే..దాంతోపాటే..అల్లంవెల్లుల్లి ప్యాకెట్ కూడా ఒకటి తీసుకెళ్తాం..కానీ బయట కొనే పెస్ట్ పెద్దగా బాగుండదు..వేరే ఆప్షన్ లేక అలా చేయాల్సి వస్తుంది. కానీ ఫ్రిడ్జ్ లేకుండా అల్లం వెల్లుల్లి స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

అల్లం వెల్లల్లి తయారీ విధానం..

చిట్కా 1: ముందుగా 250 గ్రాముల అల్లం, 250 గ్రాముల వెల్లుల్లిని తొక్క తీసి బాగా కడిగి ఆరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం వేసి అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి పేస్ట్‌ లా చేయండి. అదే ప్రక్రియలో వెల్లుల్లిని చేయండి. అల్లం, వెల్లుల్లిని విడిగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఓ పాత్రలో రెండింటినీ విడివిడిగా ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు దాని పైన రెండు టేబుల్ స్పూన్ల వంటనూనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ రెండు పేస్ట్‌లను వేరు వేరు గాలి చొరబడని పెట్టెల్లో సీల్ చేయవచ్చు.

చిట్కా 2..ముందులానే సేమ్ పేస్ట్ చేసి..లాస్ట్ లో నూనెకు బదులు వాటిపై రెండు టేబుల్‌స్పూన్ల వెనిగర్ పోయాలి. వెనిగర్ కలిపితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రంగు కొద్దిగా మారుతుంది. అంతే టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది.

చిట్కా 3: అల్లాన్ని తొక్క తీసి బటర్ పేపర్‌పై ఎండలో ఆరబెట్టండి. తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిని పొట్టు తీయకుండా కడగాలి. తర్వాత నీటిని వడకట్టాలి. ఇప్పుడు దానిని కూడా ఎండలో ఆరనివ్వండి. ఆరిన తర్వాత దాన్ని తోలు తీసి మిక్సీలో వేయాలి వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు అల్లం ,వెల్లుల్లి పౌడర్ సిద్ధం చేసుకోండి. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి. మీకు కావలసినప్పుడు ఈ పొడిని వాడండి, అవసరమైన మొత్తంలో నీరు కలపండి.

మీరు ఎప్పుడైనా సరే.. అల్లం, వెల్లుల్లిని కలిపి గ్రైండ్ చేయవద్దు. ఎందుకంటే కొన్ని కూరగాయలకు అల్లం లేదా వెల్లుల్లి పేస్ట్ మాత్రమే అవసరం. కాబట్టి పైన ఇచ్చిన పద్ధతిలో మూడు రకాల పేస్ట్‌లను సిద్ధం చేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మేజర్ మెంట్స్ చాలా ముఖ్యం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version