శీతాకాలంలో పోయి ఎండాకాలం వస్తున్నది. ఈ ఎండలు చూస్తుంటే వచ్చాయనే చెప్పవచ్చు. జలుబు, దగ్గు వానాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా వస్తుంది. అప్పుడు చలికి తట్టుకోలేక వస్తే ఇప్పుడు ఎండకు వేడి ఎక్కువై జలుబు వస్తుంది. అలాంటి సమయంలో ఆహారపదార్థాలతోనే నియంత్రించవచ్చు. అదెలాగంటే గ్రిల్డ్ చికెన్. చికెన్‌లో అమైనో యాసిడ్స్ పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతాయి. చికెన్ తినేవారిలో చికెన్‌లో ఉండే సెలీనియం వల్ల కీళ్లనొప్పులు తక్కువగా వస్తాయి. ఇంకా పిల్లలకు నచ్చే విధంగా చికెన్‌లో స్నాక్స్ తయారు చేసి పెడితే వారు ఇష్టపడి తింటారు.
చికెన్ గ్రిల్డ్ తయారీ విధానం..
కావాల్సినవి :
చికెన్ : ఒక కిలో
పచ్చిమిర్చి : 2 స్పూన్స్
ఉల్లిపేస్ట్ : 4 టీస్పూన్స్
కొత్తిమీర, పుదీనా పేస్ట్ : 2 స్పూన్స్
హనీ : 6 టేబుల్‌స్పూన్స్
నిమ్మకాయలు : 2
వెల్లుల్లిపేస్ట్ : 2 టీస్పూన్స్
పసుపు : ఒక టీస్పూన్
ఆలివ్‌నూనె : సరిపడా
ఉప్పు : తగినంత.
తయారీ : ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. తర్వాత బయటకు తీసి ముక్కలకు మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, కొత్తిమీర పేస్ట్ ముక్కలకు పట్టేలా కలుపాలి. ఆ తర్వాత ఉప్పు కలుపుకొని అరగంట నానబెట్టాలి. దీనికి ఒక టేబుల్‌స్పూన్ ఆలివ్‌నూనె కూడా వేసి కలుపాలి. తర్వాత నాన్‌స్టిక్ పాన్‌లో లేదా ఓవెన్లో రెండువైపులా గ్రిల్ చేసుకోవచ్చు. చివరిగా వీటికి హనీ రాసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ చికెన్ రోజుకో ముక్క తీసుకుంటే పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.