‘ స్టఫ్‌డ్‌ గులాబ్ జామ్ ‘ రెడీ ఇలా..

-

కావల్సిన ప‌దార్ధాలు:
బ్రెడ్‌స్లైసులు – ఆరు
కోవా – మూడు టేబుల్‌స్పూన్లు
అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు


నెయ్యి – వేయించడానికి సరిపడా
పాకం కోసం: చక్కెర – కప్పు
నీళ్లు – అరకప్పు
చక్కెర – టేబుల్‌స్పూను
యాలకులపొడి – పావుచెంచా

తయారి విధానం: 
ముందుగా ఓ గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని స్టౌ మీద‌ పెట్టాలి. తీగపాకం వచ్చాక స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ స్లైసుల అంచుల్ని తీసేసి ఒక్కోదానిపై కొద్దిగా నీళ్లు చల్లి అప్పడాల కర్రతో వత్తినట్లు చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోవా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, చక్కెర, యాలకులపొడి తీసుకుని చెంచా నీళ్లు చల్లి పిండిలా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని బ్రెడ్ స్లైసు మధ్యలో ఉంచి అంచుల్ని మూసేయాలి.

ఆ తరవాత ఉండ వచ్చేలా చేత్తో గట్టిగా నొక్కినట్లు చేసుకోవాలి. అప్పుడే డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం బ‌య‌ట‌కు రాకుండా ఉంటుంది. ఇలా మిగిలిన స్లైసుల్నీకూడా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఒక్కో ఉండను వేయించి తీసుకోవాలి. కొద్దిగా వేడి చల్లారాక చక్కెర పాకంలో వేసి ఐదు నిమిషాలయ్యాక తీసేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన య‌మ్మీ య‌మ్మీ  స్టఫ్‌డ్‌ గులాబ్‌జామ్‌లు రెడీ..!

Read more RELATED
Recommended to you

Latest news