మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అదీగాక ప్రస్తుతం వేసవి వచ్చేస్తుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్లో మీకు కావాల్సిన శక్తిని అందించే ఎనిమిది ఆహారాలు మీకోసమే.
ఆల్ఫోన్సో మామిడి:
అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ కలిగి ఉన్న ఆల్ఫోన్సో మామిడిలో పీచు పదార్థాలు చాలా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటుంది.
చియా విత్తనాలు
చియా విత్తనాలలో ఉండే పోషకాలు గుండె, కీళ్ళు, జీర్ణవ్యవస్థకి సాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పునరుత్పత్తి చేసి వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలని తగ్గిస్తుంది.
వాల్ నట్స్
యాంటీఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం ఉంటుంది. గింజల రాజుగా పిలవబడే వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
నెయ్యి:
బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ఈ లతో పాటూ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.
అత్తి పండ్లు
ఆపిల్, ఎండుద్రాక్షల కంతే అత్తిపండ్లు చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్ల వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహార్ంలో భాగం చేసుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ ని ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోండి.