పోషకాలు ఉన్న ‘స్వీట్ కార్న్ పలావ్’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

-

మనకు అవసరమైన పోషకాలు అందించే వాటిలో స్వీట్ కార్న్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ ని అనేక వంటలలో వాడుతున్నారు. ఇప్పుడు స్వీట్ కార్న్ పలావ్ చూద్దాం.దీనిని రైతా, అప్పడాల కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది.

స్వీట్ కార్న్ పలావ్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు ,నీళ్ళు 1 ½ కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బటాణీలు 1 కప్పు, ఉల్లి పాయ 1, అల్లం చిన్న ముక్క, పచ్చి మిర్చి 1, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 స్పూన్లు, గరం మసాలా ¼ స్పూన్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం కొద్దిగా, యాలకులు 2, లవంగాలు, దాల్చిన చెక్క , పుదీనా,బిర్యాని ఆకులు 2.

తయారీ విధానం: ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యాని ఆకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి దానికి కారం, పసుపు, గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.తరువాత స్వీట్ కార్న్, బటాణి లు వేసి దోరగా వేయించాలి. అందులోనే బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి తగినంత ఉప్పు, నాన బెట్టిన రైస్ వేసి ఉడికించాలి. చివరిగా నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పలావ్ రెడీ.

పోషక విలువలు: ప్రోటీన్స్ 4.5గ్రా, ఫాట్స్ 5.5గ్రా, కొవ్వులు 5.5 గ్రా, కేలరీస్ 299 మి.గ్రా, ఆక్సాలిక్ యాసిడ్ 10 మి. గ్రా.

Read more RELATED
Recommended to you

Exit mobile version