క్యారెట్, ముల్లంగి ఆవకాయ….!

-

వేసవి కాలం వచ్చిందంటే మామిడి కాయల సీజన్. ఈ సీజన్ లో దొరికే మామిడి పళ్ళు తినడానికి మాత్రమే కాక పచ్చి కాయలతో ఊరగాయలు పెట్టడం, వడియాలు, కారం అంటూ ఏదో ఒక పని తో బిజీగా ఉంటారు. ఈ మధ్య కాలంలో సీజన్ తో పని లేకుండా ఏ కాలంలోనైనా రకరకాల ఊరగాయలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఊరగాయలకు పచ్చి కూరగాయలు, దుంపలతో కూడా చేసుకోవచ్చు. అలాంటిదే ఇప్పుడు మనం చేయబోయే క్యారెట్, ముల్లంగి ఆవకాయ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

క్యారెట్, ముల్లంగి ఆవకాయకు కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు క్యారెట్ 1, ముల్లంగి 1 పచ్చి మిర్చి 2, ½ కప్పు రిఫైండ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆమ్చుర్ పౌడర్, ఉప్పు, కారం తగినంత, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, ½ స్పూన్ మెంతులు, 1 స్పూన్ సోపు గింజలు, ½ స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు.

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, సోపు గింజలను ఒక దాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని చల్లారనిచ్చి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్, ఇంగువ వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత మిక్సి పట్టిన మసాలా పొడి, ఉప్పు వేసి సన్నమంట మీద కొన్ని సెకన్లు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ముల్లంగి, క్యారెట్ ఆవకాయ రెడీ. అది చల్లబడిన తరువాత జాడీలో భద్రపరచుకోవాలి. ఈ ఆవకాయ వేడి వేడి అన్నం, రోటిల్లోకి బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news