కర్నాటకలో చేసే ప్రత్యేక స్వీటు గుల్పవటే. దీన్ని పండగలకి ఉత్సవాలకి అందరి ఇళ్ళలో సంప్రదాయంగా చేసుకుంటారు. ఇది చాలా సులభ వంటకం చిటికెలో అయిపోతుంది. పండలప్పుడు త్వరగా అయిపోయే వంటకాలలో ఇది ఒకటి. దీని తయారీ విధానం తెలుసుకుందాం.
కావాల్సినవి :
నెయ్యి : 9 టీస్పూన్లు
గోధుమపిండి : 1 కప్పు
బెల్లం : 3/4వ గిన్నె
నీరు : 1 పావు కప్పు
తురిమిన కొబ్బరి : అర కప్పు
ఏలకుల పొడి : రెండున్నర టీ స్పూన్
తయారీ :
ముందుగా కడాయిలో నెయ్యి వేడి చేయాలి. ఇందులో గోధుమపిండి వేసి సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో బెల్లం వేసి సరిపడా నీరు పోసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. దీంట్లో నెయ్యి వేసి కలుపండి. వేయించిన పిండిని పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తురిమిన కొబ్బరి, ఏలకుల పొడి జతచేసి పిండిని బాగా కలుపాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే అరచేతిని నెయ్యితో జిడ్డు చేసుకొని పిండిముద్దను బాగా వత్తుతూ కలుపండి. అందులోంచి కొంచెం తీస్తూ చిన్న ఉండలుగా చేసుకుంటే.. గుల్పవటే ఉండలు రెడీ!