ఇన్ స్టెంట్ దోశ.. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా క్షణాల్లో ఇలా చేసేయండి..!

-

దోశ తినాలంటే.. అనుకున్నంత ఈజీగా అయ్యేపని కాదు.. దానికి ముందు పెద్ద కథ ఉంటుంది కదా.. ఫస్ట్ పప్పు నానపెట్టాలి, అది రుబ్బాలి, నైట్ అంతా అలా ఉంచాలి. అప్పుడు పొద్దున్నే దోసలు చేసుకుంటాం.. కానీ కొన్నిసార్లు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇంట్లో పిండి లేకపోతే.. టిఫెన్ సెంటర్ కు వెళ్లాల్సిందే. ఇన్ స్టెంట్ గా ముందేం ప్రిపరేషన్ లేకుండా దోశలు చేసుకోవచ్చు.. ఆ గోధుమపిండితో వేసుకుంటాం కదా అవే అనుకుంటున్నారా..కాదు ఇంకోటి ఉందిగా..బొంబాయి రవ్వతో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా..!

ఇన్ స్టెంట్ దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు

మల్టీగ్రెయిన్ పిండి అరకప్పు
బియ్యంపిండి అరకప్పు
పెరుగు ఒకటిన్నర అరకప్పు
పచ్చికొబ్బరి తరుము అరకప్పు
పుట్నాల పప్పు అరకప్పు
బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్
మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టీ స్పూన్
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని బియ్యంపిండి, మల్లీగ్రెయిన్ పిండి, బొంబాయిరవ్వ, మిరియాల పొడి, జీలకర్ర, అల్లం తురుము, పుల్లగా ఉన్న పెరుగు వేసి కొద్దిగా నీళ్లు కలిపి దోశల పిండిలా కలుపుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ పై దోశలు వేసి పైన కొత్తిమీర చల్లుకుని రెండు వైపులా కాల్చుకోవడమే.. మరి దీనిలోకి చట్నీ కావాలిగా.. కావాలి అంటే చేయాలిగా.. మిక్సీజార్ లో పచ్చిమిర్చి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చికొబ్బరి తురుము వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు అందులో లెమన్ జ్యూస్, పెరుగు, నీరు , కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుని తాలింపు వేసుకోవడమే.. పావుగంటలో దోశలు విత్ చట్నీ రెడీ. బాయ్స్ కూడా సింపుల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేసుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version