ఇరానీ ఛాయ్ గురించి తెలుసుకుందామా

-

 

 

టీ  తాగితే మన మనస్సుకు కలిగే ఫీలింగ్ అంతా ఇంతా కాదు పని ఒత్తిడికి గురైన వారు ఎందరో టీ  తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు , అందులో ఇరానీ ఛాయ్ (తెలంగాణ లో టీ ని ఛాయ్ అంటారు ) గురించి చెప్పే పని లేదు.భారత్ లోని ప్రముఖ నగరాలోనూ, పట్టణాలలోనూ ఇరానీ ఛాయ్ కున్న క్రేజే వేరు.

ఇరానీ ఛాయ్ లో తేయాకు నీరు చక్కెర తప్ప, పాలు లేకుండానే తయారు చేస్తారు కొంచెం తాగితే ఆ మజానే వేరు. ఇరానీ ఛాయ్ లో రుచికొరకు కొన్ని మసాలాలు కలపడం, రాగి పాత్రలో తయారీ చేయడం దీని ప్రత్యేకతలు.ఇరానీ చాయ్ కేవలం హైదరాబాదులోనే ప్రసిద్ధి అని, ఇక్కడ మాత్రమే దొరుకుతుందనేది ఒక అపోహ మాత్రమే.

అసలు ఈ ఇరానీ ఛాయ్ అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది అని చెప్పాలి. వందల సంవత్సరాల క్రితం మన దేశానికి వలస వచ్చిన ఇరానీయన్ల నుండి మన దేశానికి పరిచయమైందే ఈ ఇరానీ ఛాయ్. ఇరాన్ దేశంలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా వారు మన దేశంలోకి వచ్చాక క్రమక్రమంగా ముంబై, పుణె & హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే వారు వచ్చింది బ్రిటిష్ వారి లా దోచుకునేందుకు కాదు, వాళ్లు మన దగ్గర స్థిరపడటమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ చాయ్ ని అలవాటు చేసి క్రమక్రమంగా ఇరానీ ఛాయ్ వ్యాపారం చేసేందుకు .

 

 

ఇరానీ ఛాయ్ దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు కుట్ర చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది, దీన్ని మించిన ఛాయ్ చేయాలని నాణ్యమైన తేయాకు పండించారు, కానీ అంతగా రుచి లేక అది ఇరానీ ఛాయ్  కింద దిగదుడుపే అయిపోయింది.

 

 

ఈ ఇరానీ కేఫ్‌లలో మనకి చిరుతిళ్ళు  ఐటమ్స్ కూడా భలే రుచికరమైనవి లభిస్తాయి. ఉదాహరణకి ఇరానీ ఛాయ్‌లోకి ఎవరౌనా ఎక్కువగా ఇష్టపడేది ఉస్మానియా బిస్కట్స్ . అలాగే ఓల్డ్ సిటీలో మనకి దొరికే చాంద్ బిస్కెట్స్ కూడా చాలా పాపులర్. వీటితో పాటు సమోసా , పఫ్స్ ఇలా అనేకమైన స్నాక్ ఐటమ్స్ మనకి అత్యల్ప ధరలో లభిస్తాయి. అందుకే ఇక్కడ సామాన్య ప్రజానీకం ఒక కప్ ఛాయ్ & బిస్కెట్‌తో వారి రోజుని ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version