రాగి ఇడ్లీని ఇలా చేసుకుని తింటే రుచితో పాటు హెల్తీ కూడా

-

ఇడ్లీ, దోస ఇంట్లో అత్యంత సాధారణ అల్పాహారం. వీటిని తినడం వల్ల కడుపు నిండుతుంది కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆరోగ్యానికి మంచిది, పోషకాలతో నిండిన అల్పాహారం తినాలి. ఒకసారి రాగి ఇడ్లీని తయారు చేసి చూడండి. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. రాగి ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

క్యాల్షియం లోపం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, ఎముకలు తెగిపోవడం, దంతాలు ఊడిపోవడం వంటివి జరుగుతాయి. మరియు ముఖ్యంగా, పురుషుల కంటే స్త్రీలు కాల్షియం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. రాగికి కాల్షియం లోపాన్ని తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. అంతే కాకుండా డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచిది. కాబట్టి, ఈ పరిస్థితిలో మీ ఇంట్లోని వ్యక్తుల కోసం వివిధ వంటకాలను తయారు చేయండి. వారు తినడానికి ఇష్టపడతారు.

రాగి ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు:

రాగి- 1 కప్పు
మెంతులు – 1 స్పూన్
ఇడ్లీ బియ్యం – 1/2 కప్పు
ఉప్పు – రుచి ప్రకారం

తయారు చేసే విధానం..

రాగులను, బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టి ఇడ్లీ పిండిలా గ్రైండ్‌ చేసుకోండి. అప్పుడే మెంతులు కూడా వేయండి. ఒక నైట్‌ అంతా పిండిని పులియబెట్టండి. పొద్దున్నే ఇడ్లీలు వేసుకున్నట్లే వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా రాగి పౌడర్‌ ఇన్‌స్టంట్‌గా ఉంటుంది. అది కావాల్సినంత తీసుకోని సరిపడా ఉప్పువేసుకోని ఇడ్లీ పిండిలా కలుపుకోని నైట్‌ అంతా ఉంచండి. ఉదయాన్నే ఇడ్లీలు వేసుకోవచ్చు.

ఇందులో బియ్యం కూడా ఉండదు కాబట్టి ఇవి ఇంకా మంచిది. వైట్‌ రైస్‌, వైట్‌ ప్రొడెక్ట్స్‌ను ఎంత తగ్గిస్తే అంత మంచిది. రాగి ఇడ్లీలోకి కచ్చితంగా చట్నీ కావాలి. పల్లీలు, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి వేసి చట్నీ చేసుకుని తింటే..టేస్ట్‌ అదిరిపోతుంది. డైట్‌ను ఇంత టేస్టీగా కూడా చేయొచ్చా అనుకుంటారు. మీరు ఇది ఏ టైమ్‌లో అయినా తినొచ్చు. మాములు ఇడ్లీ ఎన్ని తిన్నా కడుపునిండిన ఫీల్‌ రాదు. మళ్లీ వెంటనే ఆకలి వేస్తుంది. అది ఈ రాగి ఇడ్లీ అయితే నాలుగు ఐదు తింటే చాలు.. కడుపు నిండుతుంది. పైగా చాలాసేపు ఆకలి వేయదు. కాబట్టి మీరు ఇతర ఏ ఆహారం తినరు. వెయిట్‌ లాస్‌ అవ్వాలి అనుకునే వాళ్లకు ఇది మంచి ఫుడ్‌.

Read more RELATED
Recommended to you

Latest news