రూ.300 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు : మంత్రి శ్రీధర్ బాబు

-

రాష్ట్రంలో రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని 10 యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, టెక్సాస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో ఈరోజు సెక్రటేరియట్ లో సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 26-28 ల మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సులో ఈ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని తెలిపారు.అమెరికా, బ్రిటన్ కు చెందిన కంపెనీలు ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఈ ప్రతినిధులు వ్యవహరిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.తెలంగాణాలోని స్టార్టప్ కంపెనీల ఉత్పత్తులకు అమెరికాలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తారమని వెల్లడించారు. తమ ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇప్పటికే ఏర్పరిచిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news