గుడ్డు మాత్రమే కాదు.. గుడ్డు పెంకులను కూడా తినాలట..!

-

గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. రోజూ ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు అనే మాట. అయితే గుడ్డు అంటే ఎవరైనా ఉడకపెట్టుకోనో, కూరల్లోనే తింటారు. పైన పెంకులను మాత్రం ఎవరైనా తీసి డస్ట్‌బిన్‌లో వేస్తారు. లేదా మొక్కలకు వేసుకుంటారు.. కానీ గుడ్డు పెంకులను కూడా తినమని పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయో… గుడ్డు పెంకులలో కూడా అన్ని పోషకాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు.

పెంకుల్లో ఏముంది..

అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, ప్రోటీన్లు ఇతర ఖనిజాలు ఉంటాయట. పోషకాహార నిపుణులు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌లో.. ఒక గుడ్డు పెంకులో సగం తిన్నా కూడా మన శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియం దొరుకుతుందని పేర్కొన్నారు.

గుడ్డు పెంకులో లభించే కాల్షియం, కార్బోనేట్ వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయట. ఈ పెంకులో మెగ్నీషియం, ఫ్లోరైడ్ వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. ఆస్టియోపోరొసిస్ వంటి ఎముకలను బలహీనపరిచే వ్యాధుల నుంచి గుడ్డు పెంకులు కాపాడతాయని వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఆస్టియోపొరోసిస్. కాల్షియం లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. గుడ్డు పెంకులను తినడం వల్ల ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చట.. వావ్‌.. ఆశ్చర్యంగా ఉందే..

ఉడికించిన గుడ్డుపు పైన పెంకులు తీసేప్పుడు మీరు చేసే ఉంటారు.. ఒక తెల్లగా ఉండే పలుచటి పొర ఉంటుంది. అందరూ అది కూడా తీసి పడేస్తారు. ఆ పొర కూడా తినాల్సిన అవసరం ఉంది. అది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందట.

పెంకులను ఎలా తినాలి?

పెంకులను తినమన్నారు..బానే ఉంది.. కానీ అవి ఎలా తినాలి..? గుడ్డు పెంకులు తినడానికి ఉత్తమ మార్గం.. గుడ్డును ఉడకబెట్టాక పెంకులను తొలగించాలి. తొలగించిన ఆ పెంకులను మిక్సీలో వేసి పౌడర్ చేయండి.. ఆ పొడిని ఆహారంలో కలుపుకొని తింటే సులువుగా పొట్టలోకి చేరిపోతుంది. గుడ్డు పెంకులకు ప్రత్యేకమైన రుచి ఉండదు, కాబట్టి తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది గుడ్డు పెంకులను ముక్కలు ముక్కలుగా తినాలని చూస్తారు. అలా తినడం వల్ల గొంతులో ఆ ముక్కలు ఇరుక్కుపోతాయి.. అన్నవాహికకు కూడా ఇలా గుడ్డు పెంకులు తినడం వల్ల సమస్య రావచ్చు.

ఇలా తినొద్దు..

పచ్చి గుడ్డు పెంకును తినకూడదు. పచ్చి గుడ్డు మీద ఉన్న పెంకులు తినడం వల్ల ‘సాల్మొనెల్ల ఎంటరిటిడిస్’ వంటి బ్యాక్టీరియా శరీరంలో చేరి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version