బాబోయ్ ఈ ఆహారపదార్దాలని తీసుకుంటున్నారా..? కిడ్నీ లో రాళ్లు ఖాయం..!!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు కిడ్నీలో రాళ్లు కూడా ఒకటి కిడ్నీలో రాళ్లు చేరడం వలన చాలా మంది సతమతమవుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కొన్ని ఆహార పదార్థాలు దారితీస్తాయి. మనం తీసుకునే ఆహారం పై దృష్టి పెడితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఒకవేళ కనుక మీరు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లయితే కచ్చితంగా మీకు కిడ్నీలలో రాళ్లు చేరుతాయి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు అవుతుంది. కిడ్నీలో రాళ్లు చేరడానికి ఏఏ ఆహార పదార్థాలు దారి తీస్తాయి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.

కూల్ డ్రింక్స్:

కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కలుగుతాయి. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉండే వాటిని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు చేరే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి పానీయాలని అస్సలు తీసుకోవద్దు.

ఎక్కువ సోడియం:

ఎక్కువ సోడియం ఉండే వాటిని తీసుకోవద్దు. బాగా డీప్ గా వేయించిన చికెన్ వంటి వాటిని కూడా తీసుకోకండి. ఉప్పుతో వేయించిన గింజలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండడం మంచిది. చాలా మంది ఈ మధ్యకాలంలో పిజ్జా, బర్గర్, శాండ్విచ్ వంటి వాటిని తీసుకుంటున్నారు కానీ ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది.

ప్రాసెస్ చేసిన మాంసం:

ప్రాసెస్ చేసిన మాంసం ఉప్పుతో ఉంటుంది ఇటువంటి వాటిని అస్సలు తీసుకోవద్దు పైగా వీటిలో కెమికల్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది.

బ్లాక్ టీ:

ఎక్కువగా మోతాదులో బ్లాక్ టీ ని తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ బ్లాక్ టీ ని కూడా తీసుకోవద్దు.

బాదం, జీడిపప్పు:

జీడిపప్పు బాదం వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారాన్ని మాత్రమే డైట్ లో తీసుకోండి అలా అని ఏ ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version