పాలకూరతో ఆమ్లెట్‌.. రక్తహీతనకు, డయబెటీస్‌కు బెస్ట్‌ ఫుడ్‌

-

ఆకుకూరలు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో పాలకూర ఇంకా మంచిది. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవాళ్లు పాలకూరను రెగ్యులర్‌గా తింటుంటే.. బాడీకి రక్తం పడుతుంది. ఇందులో పుష్కలంగా ఐరన్‌ కంటెంట్‌ ఉంది. కానీ పాలకూరను పప్పులా చేసకుని రోజూ తినలేం. సూప్‌ కూడా తాగలేం. కానీ ఆమ్లెట్‌గా చేసుకుని తినొచ్చు. పాలకూరతో ఆమ్లెట్‌ ఎలా చేసుకోవాలా అనుకుంటున్నారా..? మేం ఉన్నాంగా.. ఎలా చేయాలో చెప్పనికీ.!

పాలకూర ఆమ్లెట్‌ తయారు చేయడానికి కావాలిన పదార్థాలు..

4 గుడ్లు
కట్ట పాలకూర, సన్నటి తరుగు
4 ఉల్లికాడలు, ముక్కలు
చిన్న ఉల్లిపాయ, ముక్కలు
పావు చెంచా అల్లం తరుగు
పావు చెంచా మిరియాల పొడి
కొద్దిగా కొత్తిమీర తరుగు
పావు చెంచా పసుపు
చెంచా కారం
తగినంత ఉప్పు
చెంచా చీజ్ తురుము
చెంచా బటర్ లేదా నూనె

తయారీ విధానం:

ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టండి. గుడ్లను పగలగొట్టి సొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు కాస్త వెడల్పాటి, లోతుగా ఉండే ప్యాన్‌లో బటర్ లేదా నూనె వేసుకుని వేడెక్కాక పచ్చిమిర్చి, పాలకూర, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడలు వేసుకుని ఒక నిమిషం పాటూ వేగనివ్వాలి. మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి ఒకసారి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్నంతా పెనం మొత్తం సర్దాలి. ఇప్పుడు గుడ్డు సొనను ఆమ్లెట్ లాగా పెనం అంతంటా పోసుకోవాలి. ఆమ్లెట్ ఉడికాక చీజ్ తురుము వేసుకుని మడిచి సర్వ్ చేసుకుంటే చాలు.

పాలకూర ఆమ్లెట్ రెడీ. ఇది కొంచెం ప్రాసెస్‌ ఎక్కువగా ఉంది అనుకుంటే.. గుడ్ల సొనలోనే పాలకూరతో సహా అన్నీ కలిపేసి బాగా మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని పెనం మీద నూనె రాసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే. ఎలాగైనా రుచి బాగుంటుంది. ఇలా తింటే.. పోషకాలు మరింత పెరిగి. ఇంకా హెల్తీ అవుతుంది. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్‌గా వేసుకునే ఆమ్లెట్‌కు బదులు ఇలా ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version