క్యాబేజీ తో ఊరగాయ పచ్చడి

-

సాధారణంగా క్యాబేజీ తో కూరలు లేదా వేపుడులు చూస్తూ ఉంటాం కానీ క్యాబేజీ తో ఊరగాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అది ఎలా కింద చూద్దాం.

ముందుగా క్యాబేజీ పచ్చడి తయారు చేయడం కోసం కావాల్సిన పదార్థాలు.
క్యాబేజీ – 1/2 కిలో , కారం – ఒక కప్పు,
ఉప్పు- ఒక కప్పు, ఆవపిండి – 6 టీస్పూన్ల , చింతపిండి గుజ్జు – 1/2 కప్పు ,
వెల్లుల్లి – 20 రెబ్బలు, ఆవాలు – టీ స్పూను , మెంతులు – 1/2 టీ స్పూను,
జీల కర్ర – టీ స్పూను , పసుపు – కొద్దిగా ,
ఎండు మిరపకాయలు –  4 , ఇంగువ – చిటికెడు మరియు నూనె – 1/2 కప్పు

తయారు చేసే విధానం :

1. ముందుగా క్యాబేజీ ని చిన్న చిన్న ముక్కలు గా తరిగి ఉంచుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, మెంతులు , జీల కర్ర, ఇంగువ , పసుపు వేసి వేయించాలి.
3. తర్వాత అందులో తరిగిన క్యాబేజీని వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. అందులోనే చింతపండు గుజ్జు వేసి బాగా ఉడికించాలి.
4. ఓ గిన్నెలో వేయించిన క్యాబేజీ మిశ్రమం , ఉప్పు, కారం , ఆవపిండి , వెల్లుల్లి వేసి బాగా కలిపితే పచ్చడి సిద్ధం అవుతుంది.
 ఈ పచ్చడి చాలా రుచిగా ఉటుంది, ఎవరైనా క్యాబేజీ ని కురాగా ఇష్టపడకపోతే ఇలా ఊరగాయ పచ్చడి చేసుకొని తినండి. ఇది నిల్వ కూడ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version