పైనాపిల్ ఫ్రైడ్‌రైస్ ఎలా తయారీ చేయాలో తెలుసా..?

-

కావలసిన పదార్థాలు :
టోఫు క్యూబ్స్ : 8 – 10
జీడిపప్పు, ఎండుద్రాక్ష : 7-8
అల్లం, వెల్లుల్లి ముక్కలు : 1 టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ ముక్కలు : పావు కప్పు
క్యారెట్ : 1పచ్చిబఠానీలు : 1 టేబుల్‌స్పూన్
పైనాపిల్ ముక్కలు : అర కప్పు
సోయాసాస్ : 1 టేబుల్‌స్పూన్

బ్ల్యాక్ పెప్పర్‌పొడి : అర టీస్పూన్
అన్నం : 2 కప్పులు
పైనాపిల్ జూస్ : 1 టేబుల్‌స్పూన్
ఉల్లికాడ ముక్కలు : తగినన్ని
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :
కడాయిలో నూనె వేడిచేసి అందులో టోఫు క్యూబ్స్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నూనెవేసి జీడిపప్పు, ఎండుద్రాక్షను దోరగా వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి ఇవి కూడా దోరగా అయ్యేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిముక్కలు వేసి ఫ్రై చేయాలి. దీని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిబఠానీలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి. కట్ చేసిన పైనాపిల్ ముక్కలు, ఉప్పు, బ్ల్యాక్ పెప్పర్‌పొడి, సోయాసాస్, టోఫు క్యూబ్స్, అన్నం, పైనాపిల్ జూస్ వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత నిమిషంపాటు వేడి చేసుకొని బౌల్‌లో తీసుకొని తింటే ఆ టేస్టే వేరు.

Read more RELATED
Recommended to you

Latest news