రైస్, చపాతీ.. రెండింట్లో బరువు తగ్గడానికి మైలైనది ఏంటంటే?

-

మహమ్మారి కారణంగా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడంతో బరువు పెరుగుదల సమస్యలు దాదాపుగా అందరిలోనూ కనిపించాయి. జిమ్ కి కూడా వెళ్ళలేక పోవడంతో బరువు సమస్య మరింత తీవ్రమైంది. ఐతే చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే, రైస్ తినడం వల్లనే బరువు పెరుగుతున్నామని. బియ్యాన్ని ఆహారంగా వండుకోవడం వల్లనే బరువు పెరుగుతున్నామని, దానికి బదులు గోధుమతో చేసిన చపాతీ తింటే బాగుంటుందని, చపాతీ తినడం వల్ల బరువు తగ్గుతామని చెబుతారు.

ఐతే దీనిలో నిజం ఎంతుంది? బియ్యం ఆహారంగా తీసుకోవడం వల్ల నిజంగానే బరువు పెరుగుతున్నామా? గోధుమతో చేసిన చపాతీ తింటే బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుందా? అన్నది ఈ రోజు తెలుసుకుందాం.

పోషకాహార్ నిపుణుల ప్రకారం బరువు తగ్గాలనుకునే వారు కార్బోహైడ్రేట్లని మొత్తానికే తినకుండా ఉండడం అనేది సరికాదు. వాటివల్ల శక్తి వస్తుంది. సరైన నిద్ర ఉంటుంది. ఆకలిని తీర్చడంలో కార్బోహైడ్రేట్ల పాత్ర కీలకం.

ఐతే బరువు తగ్గడం అనేది తినే విధానం మీద ఆధారపడి ఉంటుందట. ఎంత ఆహారం తీసుకుంటే, మీ శరీరం సరిగ్గా స్పందిస్తుంది. ఏది తీసుకుంటే సరిగ్గా పనిచేయగలుగుతుందనేది తెలుసుకోవాలి. కొందరు చపాతీలు ఎక్కువగా తినలేరు. దానికి కారణం గ్యాస్. బరువు తగ్గడానికి అది కూడా ఓ కారణం కావచ్చు.

బరువు తగ్గడానికి ఇది మంచి చేస్తుంది, అది చెడు చేస్తుందని చెప్పలేం, ఏది ఎంత తినాలి, ఎంత తింటే మీకు సరిగ్గా జీర్ణమై, శక్తిగా మారుతుందో తెలుసుకుని, కంట్రోల్ లో ఉంటే చాలని పోషకాహార నిపుణుల అభిప్రాయం. అందుకే మీ శరీరం గురించి ఏమీ తెలుసుకోకుండా బరువు తగ్గడానికి డైట్ నియమాలు పాటించవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version