భరణి దర్శకత్వంలో దర్శకేంద్రుడు.. ఐదుగురు హీరోయిన్స్‌

-

ఇంతకాలం కెమెరా వెనకాల వున్న రాఘవేంద్రరావు… 76 ఏళ్ల వయసులో ముందుకొచ్చి నటిస్తారన్న వార్త కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్త కొందరికి ఆశ్చర్యం కలిగించగా.. గాసిప్సేనంటూ లైట్‌గా తీసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని డైరెక్టర్‌ బైటపెట్టేశాడు. నూరు చిత్రాలు తీసిన దర్శకేంద్రుడిని తనికెళ్లభరణి డైరెక్ట్‌ చేస్తున్నాడు.

రాఘవేంద్రరావు నటించే సినిమాను ఓ టీవీ కార్యక్రమంలో తనికెళ్ల భరణి బైటపెట్టాడు. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ వుంటారని .. కొత్త సంవత్సరంలో సినిమా సెట్స్‌పైకి వస్తోందన్నారు. షార్ట్ ఫిలింస్‌ తీసిన తనికెళ్లభరణి ‘మిధునం’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే.. ప్రశంసలు అందుకున్న భరణి.. రెండో సినిమా పనుల్లో బిజీగా వున్నారు.

కె. రాఘవేంద్రరావు నటించే సినిమాకు తనికెళ్ల భరణి శిష్యుడు జనార్దన మహర్షి కథ అందించారు. పలు కామెడీ సినిమాలకు కథ, మాటలు రాసిన మహర్షి గోపి గోడమీద పిల్లి మూవీతో దర్శకుడిగా మారాడు. ఆతర్వాత శ్రియాతో తీసిన పవిత్ర నిరాశపరిచింది. దర్శకుడిగా సక్సెస్‌ అందుకోలేకపోయినా.. 100 సినిమాలు డైరెక్ట్‌ చేసిన కె రాఘవేంద్రరావు నటించే సినిమా కథ ఈయనదే కావడం విశేషం.

మెగాఫోన్‌కు దూరంగా వున్న రాఘవేంద్రరావు తన పర్యవేక్షణలో పెళ్లిసందడి తీస్తున్నాడు. శ్రీకాంత్‌ వారసుడు రోషన్‌ హీరోగా నటించే ఈ మూవీని గౌరి డైరెక్ట్‌ చేయనుంది. మరోవైపు.. తనికెళ్లభరణి మూవీ డైరెక్షన్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్స్‌ గా రమ్యకృష్ణ, శ్రియ, నటిస్తున్నారని తెలిసింది. మొత్తానికి సౌందర్యలహరితో ముని మౌనం వీడారు. కొత్త సంవత్సరంలో.. అందులోపూ.. 76 ఏళ్ల వయసులో యాక్టర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version