సండే స్పెషల్: గోదావరి జిల్లా చేపల ఇగురు..!

-

కావాల్సినవి :

చేప ముక్కలు
ఉల్లిపాయలు 5
పచ్చిమిర్చి 5
నూనె 2 గరిటె లు
పసుపు చిటికెడు
ఉప్పు 1 స్పూన్
కారం 2 1/2 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 1/2 స్పూన్
ఫిష్ మసాలా పొడి 1/2 స్పూన్
కరివేపాకు
కొత్తిమీర

5 ఉల్లిపాయలు ముక్కలు గా కట్ చేసి మిక్సి లో మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేయాలి..వెడలపాటి పాన్ లో 2 గరిటెల నూనె వేసి వేడయ్యాక 5 పచ్చిమిర్చి పొడవుగా చేసి వేసి వేగాక, 1స్పూన్ ఉల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి….దాన్లో 1/4 స్పూన్ పసుపు, 2,1/2 స్పూన్ కారం,1 స్పూన్ ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి…..ఇప్పుడు చేప ముక్కలు పాన్ లో వరసగా విడి విడిగా వేసి ఒక 5 నిముషాలు  మూత పెట్టాలి.

తర్వాత చేప ముక్కలు ఒక్కొకటి రెండో వైపు తిరగ వెయ్యాలి నెమ్మది గా ఒక 5 నిముషాలు మూత పెట్టాలి….అయ్యాక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి, 1/2 స్పూన్ ఫిష్ మసాల పొడి వేసి, 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టీ దగ్గర అయ్యే వరకు ఉంచి నీళ్లు ఇగిరి దగ్గర అయ్యాక కట్టేయలి…..అంతే ఎంతో రుచికరమైన గోదావరి జిల్లా చేపలు ఇగురు రెడీ..!

Read more RELATED
Recommended to you

Latest news