వంటలు : వెజ్ ఫ్రైడ్‌రైస్ తయారీ విధానం

-

కావలసిన పదార్థాలు :
అన్నం : 2 కప్పులు
అల్లం ముక్కలు : 1 టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ : 1
క్యాప్సికమ్ : అర కప్పు
క్యారెట్ : అర కప్పు
క్యాబేజ్ : అర కప్పు
కార్న్ : 2 టేబుల్ స్పూన్లు
వెనిగర్ : 2 టేబుల్ స్పూన్లు
సోయాసాస్ : 2 టీస్పూన్లు
బ్లాక్ పెప్పర్ : అర టీస్పూన్
ఉల్లికాడలు : టీ స్పూన్
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :
కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కట్‌చేసి పెట్టుకున్న అల్లం, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. మిశ్రమం దగ్గర పడేంత వరకు వేయించాలి. అందులో క్యాబేజ్ ముక్కలు వేసి కలుపాలి. బాగా వేగిన తర్వాత వెనిగర్, సోయాసాస్, ఉప్పు వేసి కలుపాలి. ముందుగా తయారు చేసిన అన్నాన్ని మిశ్రమంలో వేసి కలుపాలి. బ్లాక్‌పెప్పర్, ఉల్లికాడల ముక్కలు వేసి నిమిషంపాటు వేడి చేయాలి. ఇక అంతే కావలసిన వెజ్ ఫ్రైడ్‌రైస్ రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news