Numais: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నుమాయిష్ పైన కీలక ప్రకటన వచ్చింది. హైదరాబాద్ లోని నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్… గడువు పొడవుంచారు. నుమాయిష్ మరో రెండు రోజులపాటు నిర్వహించబోతున్నారు. వాస్తవానికి జనవరి ఒకటో తేదీకీ బదులు జనవరి మూడో తేదీన నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
ఈ లెక్కన ఫిబ్రవరి 15వ తేదీన ఈ నుమాయిష్ ముగియాల్సి ఉంటుంది. అయితే ఆలస్యంగా నుమాయిష్ ప్రారంభమైన నేపథ్యంలో… దానికి గడువును రెండు రోజులపాటు పెంచారు. అంటే ఈ లెక్కన ఫిబ్రవరి 17వ తేదీన నుమాయిష్ ఎగ్జిబిషన్ ముగుస్తుందని సొసైటీ సభ్యులు ప్రకటన చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. నుమాయిష్ కమిటీ సభ్యులు ప్రకటన చేశారు.