30 దాటిన మహిళలు ఈ పానీయాలు తప్పక తీసుకోవాలి..

-

మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు. కష్టాలను తట్టుకునే శక్తి వీరికే ఎక్కువ. అయితే ఇక్కడ మనం శారీరక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 ఏళ్లు దాటిన ఆడవారిలో శారీరకంగా చాలా మార్పులు మొదలవుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, కాసేపు నడిస్తేనే మోకాలి నొప్పులు రావడం వంటివి జరుగుతాయి.

ఓపక్క ఇంటి పని, మరో పక్క ఉద్యోగం, ఇంకో పక్క పిల్లల బాధ్యతలు ఇన్ని పనుల మధ్యలో తన గురించి తాను పట్టించుకోదు..30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం మంచిది.. చురుగ్గా పనిచేయాలన్నా కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. టీ , షర్బెత్‌లు, స్మూతీలు, జ్యూస్‌లు వంటివి చేసుకుని తాగేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది.అవేమిటో ఒకసారి తెలుసుకుందాం..

స్మూతీలు, జ్యూస్ లు,లస్సీలు వంటి వాటిల్లో చియా సీడ్స్ వేసుకుని తాగితే మంచిది. వీటిని కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలను పెంచుకోవచ్చు. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో, శరీరంలో నీటిని నిలపడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి..ఇవి మనిషిని చురుగ్గా ఉంచుతాయి.

పెరుగుతో స్మూతీలు, షేక్‌లను చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంంది. 30 ఏళ్లు దాటిన తరువాత మహిళల్లో రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రతను పెంచడం అవసరం. పాల కన్నా పెరుగుతో చేసిన పానీయాలు తాగడం మంచిది. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు ముందుంటుంది. ప్రొబయోటిక్ బ్యాక్టిరియాలో పెరుగు నిండి ఉంటుంది. ఇదే మంచి బ్యాక్టిరియా..కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీలు, రాస్ బెర్రీలు వంటివి సూపర్ మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని స్మూతీస్ లేదా షేక్స్ రూపంలో చేసుకుని తాగితే మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. మూత్రనాళ సమస్యలు,వృద్ధాప్య సంకేతాలు త్వరగా రావు..ముఖ్యంగా ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది..వీటి వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.

చేమంతి పూల టీ వల్ల కండరాలు, నరాలు సడలించడంలో ఇవి సహకరిస్తాయి. చేమంతి పూలలో హీలింగ్ గుణాలు అధికం. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. రుతుక్రమ సమయంలో నొప్పిని, తిమ్మిరిని తగ్గిస్తుంది..అలాగే క్యాన్సర్‌ లను నివారిస్తుంది..

పైన తెలిపిన వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version