కడుపు ఉబ్బరంగా ఉంటోందా? కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించండి. ఇలా చేసినట్లయితే కడుపు ఉబ్బరం చిటికెలో తగ్గిపోతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కాసేపు వాకింగ్ చేయాలి రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు వేగంగా వాకింగ్ చేయడం వలన కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు యోగా చేస్తే కూడా బాగుంటుంది. యోగా చేస్తే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు మీద ఒత్తిడి పడి గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. బాలాసనం వేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. కడుపు ఉబ్బరంతో బాధపడే వాళ్ళు గ్యాస్ ని బయటకి పంపించే క్యాప్సిల్స్ ని ఉపయోగించడం వలన సులువుగా సమస్య పోతుంది. కానీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే మందులు వాడండి.
పుదీనా తీసుకుంటే కడుపుబ్బరం సులువుగా తగ్గుతుంది. పుదీనా వలన పేగు కదిలికలు కూడా బాగుంటాయి గ్యాస్ సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడటానికి అవుతుంది. కడుపు ఉబ్బరం సమస్య ఉన్నట్లయితే పొట్ట దగ్గర మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన ఏ బాధ ఉండదు. ఉదర సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయండి. కనీసం 15 నిమిషాల వరకు వేడి నీటితో స్నానం చేస్తే బాగుంటుంది.
వ్యాయామాలు చేస్తే కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. అరగంట పాటు వాకింగ్ వంటివి చేయండి. ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోరు కానీ మంచిగా నీళ్లు తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. పుదీనా, అల్లం కలిపిన నీళ్లు తీసుకుంటే ఇంకా మంచిది కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు ఉప్పు తగ్గించడం మంచిది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే సమస్య ఇంకా ఎక్కువగా అవుతుందని గుర్తు పెట్టుకోండి. వీటిని ఫాలో అయినట్లయితే సులువుగా సమస్య నుంచి బయటపడొచ్చు.