విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. చార్జీల భారంపై ప్రజలకు అండగా నిలిచేందుకు వైసీపీ పోరాటం చేస్తుంది. ప్రజలపై 15,485 కోట్ల భారం మోపింది. ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది. ఇప్పటికే రైతులకు అండగా ఉండి పోరాటాలు చేశాం. ఆరునెలల్లో సూపర్ సిక్స్ ఇస్తాడనుకుంటే ఎటు పోయిందో తెలియదు.
వైసీపీ 5 కోట్ల మంది ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం ఉంది. ఆరునెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలుజరిగేదో అంటూ ప్రజలు బాధ పడుతున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆనాడు పెంచిన కరెంటు చార్జీల మీద పోరాటం చేస్తే.. చంద్రబాబు కాల్పుల్లో పలువురు మరణించిన విషయం అందరికి గుర్తుంది అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కాదు.. బాధుడు బాబుగా మారారు. చంద్రబాబు మోసాలు ఇకనైనా అందరూ గమనించాలి అని మాజీ మంత్రి పేర్కొన్నారు.