వృద్ధాప్యం జీవితంలో ఒక సహజమైన దశ ఇది శారీరకంగా మానసికంగా, భావోద్వేగ సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఈ దశలో మనసు, శరీరం ప్రశాంతతను కోరుకుంటాయి. మరి ఇలాంటి టైం లో ధ్యానం ప్రశాంతతను పొందడానికి సమర్థవంతమైన మార్గం వృద్ధులు ధ్యానాన్ని ఎలా ప్రారంభించాలి? ధ్యానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం..
ధ్యానం అంటే: ధ్యానం అనేది మనసును శాంతింప చేసి, ఏకాగ్రతను పెంచే ఒక సాధనం. ఇది శ్వాస సంబంధించిన ఆలోచనను ఒక నిర్దిష్టమైన బిందువుపై ఏకాగ్రతను స్థిరపరిచి మానసిక స్థిరత్వాన్ని సాధించే ప్రక్రియ. ముఖ్యంగా వృద్ధులకు ఒత్తిడిని తగ్గించడానికి నిద్రను మెరుగుపరచడానికి జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది.
ధ్యానం వలన వృద్ధులకు ప్రయోజనాలు: మానసికంగా ఒత్తిడిని తగ్గిస్తుంది వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఒంటరిగా ఉండడం ఆర్థికంగా ఆందోళన వలన వారికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది ధ్యానం మనసుని శాంతిని పరచడం తోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.మెరుగైన నిద్రని వృద్ధాప్యంలో అందిస్తుంది. వయసు పైబడే కొద్దీ నిద్రలేని సమస్యలు సర్వసాధారణం అయిపోతాయి. రోజు ధ్యానం చేయడం శరీరం హాయిగా అనిపించి నిద్ర త్వరగా పడుతుంది.
ఏకాగ్రత జ్ఞాపకశక్తి: వయసు పైబడిన వారిలో ఎక్కువగా మనం చూసే సమస్యలు ఏకాగ్రత లోపించటం. ఏది చెప్పినా వారికి గుర్తుండకపోవడం ఒక పని మీద ఏకాగ్రతగా కూర్చోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలకు ధ్యానంతో తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యం కోసం:వృద్ధాప్యంలో అందరికీ ఎదురయ్యే సమస్య శారీరకంగా అనారోగ్యం,మానసిక అశాంతి, ఇలాంటి సమస్యలకు మంచి మార్గం ధ్యానం.ప్రతిరోజూ ధ్యానం చేయటం వలన ఎన్నో లాభాలు వున్నాయి. ముఖ్యం గా రక్తపోటు నియంత్రించుకోవచ్చు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం,రోగనిరోధక శక్తిని పెంచుకోవడం,ఒత్తిడి తగ్గించుకోవటంలో ధ్యానం ఎంతో సహాయపడుతుంది.
ధ్యానం ఎలా ప్రారంభించాలి: ధ్యానం ప్రారంభించడానికి నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశాన్ని లేదా బహిరంగ ప్రదేశాల్లో అయినా చేయవచ్చు. వృద్ధులు కింద కూర్చొని ధ్యానం చేయలేరు కాబట్టి సౌకర్యవంతమైన కుర్చీ పైన, బల్ల పైన కూర్చుని చేయవచ్చు. శరీరం నొప్పి లేకుండా ఉండేలా చూసుకుంటే చాలు. ఇక కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా శ్వాస విడిచి పెట్టాలి మీ శ్వాస పైనే మీ దృష్టి అంతా ఉంచాలి. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు అది గమనించుకుంటూ ఉండాలి. రోజుకు కనీసం ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లొచ్చు.
జాగ్రత్తలు : శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే బలవంతంగా ధ్యానం చేయొద్దు. మీకు అనువైన ప్లేస్ లో కూర్చుని ధ్యానం చేయండి. కిందే కూర్చోవాలని నియమం లేదు మంచం పైన, వీల్ చైర్ లో ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయవచ్చు. ధ్యానం సమయంలో ఒత్తిడి అసౌకర్యం కలిగితే వెంటనే ఆపేసి సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్లాలి. ధ్యానం ప్రారంభించడానికి వైద్య సలహా అవసరమైతే మొదట వైద్యుని సంప్రదించి ఆ తర్వాత ధ్యానం చేయడం మొదలు పెట్టొచ్చు.
(గమనిక : పైన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే )