వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మరియు రోజు వారి ఆహారం విషయంలో ఎన్నో మార్పులను చేసుకునే అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా సీజన్ మారినప్పుడు అందుబాటులో ఉండే కూరగాయలు కూడా మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సీజన్ లో దొరికేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అందుబాటులో ఉండే కూరగాయలు డిహైడ్రేషన్ రాకుండా ఉంచుతాయి మరియు సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకోవడానికి సహాయం చేస్తాయి. వేసవిలో గుమ్మడికాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. గుమ్మడికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వీటిలో బీటా కేరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దాని వలన విటమిన్ ఏ శరీరంలోకి అందుతుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచడానికి కూడా గుమ్మడికాయ సహాయం చేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి మొదలైన జీర్ణ సమస్యలు రాకుండా సహాయం చేస్తుంది. సొరకాయలు కూడా వేసవికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. సహజంగా చాలా మంది సొరకాయలను ఎక్కువగా ఉపయోగించరు. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు నీటితో నిండిన సొరకాయలను తీసుకోవడం వలన ఎంతో హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. పైగా వీటిలో క్యాలరీలు కూడా ఎంతో తక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో కీరదోసకాయను తప్పకుండా తీసుకోవాలి. కేవలం హైడ్రేటెడ్ గా ఉంచడానికి మాత్రమే కాకుండా దీనిలో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చర్మ ఆరోగ్యానికి కూడా కీరదోసకాయ సహాయం చేస్తుంది. కనుక తప్పకుండా కీర దోసకాయను తరచుగా తీసుకోండి. వేసవి కాలంలో అందుబాటులో ఉండే కూరగాయలలో పొటల్స్ కూడా ఒకటి. ఇవి దొండకాయ ఆకారంలో ఉంటాయి కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి. పొటల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దాంతో జీర్ణవ్యవస్థ కు సంబంధించిన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయం చేస్తాయి. పైగా వేసవికాలంలో వీటిని తినడం వలన ఎన్నో సమస్యలు రాకుండా కాపాడుతాయి. కనుక ఈ వేసవిలో తప్పకుండా ఇటువంటి కూరగాయలను మీ ఆహారంలో భాగంగా తీసుకోండి.