మద్యపానం వల్ల ఎయిడ్స్…?

-

ఎవరు ఎన్ని కథలు చెప్పినా సరే మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. మద్యపానం తో చాలా సమస్యలు వస్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసినా సరే మద్యపానం మానలేక చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే తాజాగా కొందరు పరిశోధకులు చెప్పిన విషయాలు చూస్తే మద్యపానం ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది.

మద్యం అనేది విషజన్యమైన ఔషధ౦ అనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలోని ప్రతి అవయవం మీద ఏదోక రూపంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. రోజు మద్యం తాగడం తో నరాల బలహీనత రావడమే కాకుండా కొన్ని తీవ్ర వ్యాధులు కూడా వస్తు ఉంటాయి. అల్సర్‌, గుండెజబ్బులు, కిడ్నీ, లివర్‌ అనారోగ్యాల బారిన పడతారు అని, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వారు గుర్తించారు.

క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని వారు తేల్చారు. మద్యపానం అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెప్తూ ఒక సంచలన విషయం చెప్పారు వాళ్ళు. మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బ తినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, టీబీ , హెచ్ఐవితో సహా సంక్రమణ వ్యాధుల సోకె ప్రమాదాన్ని పెంచుతుందనివారు హెచ్చరించారు. మద్యపానీయాలపై పన్నులు పెంచడం, మద్యం పై నిషేధాలను అమలు చేయడం, ప్రకటనలు మరియు మద్యం లభ్యతపై పరిమితులు విధించడం అనేది మద్యపానానికి ప్రజలను దూరం చేసే మార్గం.

Read more RELATED
Recommended to you

Exit mobile version